కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-05-19T04:24:21+05:30 IST

కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీ పథకం కింది తక్షణమే చేర్చాలని, కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి అన్ని వ ర్గాలకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడు గంటి పేట రాజు డిమాండ్‌ చేశారు.

కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి

- సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకుల నిరసన 

గద్వాల అర్బన్‌, మే18:  కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీ పథకం కింది తక్షణమే చేర్చాలని, కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి అన్ని వ ర్గాలకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడు గంటి పేట రాజు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో ఈఫ్ట్‌ కార్యాలయంలో  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకులు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విధిం చిన లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు, చిరు వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కి నెలకు రూ.7,500లు, 50కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వం తక్షణమే  ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకొని వైద్యసేవలందించాలన్నారు. ప ట్టణాలు, గ్రామాల్లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృం భిస్తోందని, బాధితులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరి యైున వైద్యం అందక, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు మందులు దొరకక బ్లాక్‌లో కొంటున్నా రని, ప్రైవేటు, ఫార్మా కంపెనీలు బాధితులను నిలు వునా దోచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశా రు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్లే కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నా యన్నారు.  కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకు లు గణేష్‌, సాగర, పీడీఎస్‌యూ నాయకులు వంశీ, మన్యం, చందులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:24:21+05:30 IST