అందరి భాగస్వామ్యంతోనే కరోనా అంతం
ABN , First Publish Date - 2021-05-20T05:46:58+05:30 IST
అందరి భాగస్వామ్యంతోనే కరో నా అంతమవుతుందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ (వైద్య విబాగం), మే 19 : అందరి భాగస్వామ్యంతోనే కరో నా అంతమవుతుందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యూ ష సపోర్ట్ వారి సహకారంతో దిశ ఫౌండే షన్ సినీ నటి సమంత ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పది ఆక్సిజన్ కాన్సం ట్రేటర్లు, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ద్వారా మరో రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రితో కలిసి ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దేవరకద్ర, రాజాపూర్, సీసీకుంట, తది తర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో వినియోగిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దీనికితోడుగా ప్రైవేటు సంస్థలు సహకారం అందిస్తే కరోనాను అంతం చేయొచ్చని సూచించారు. పెరుగుతున్న కేసుల వల్ల అందరూ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారని, ఆక్సీజన్ కొరత వల్ల అవసరమైనన్ని బెడ్స్ ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పారు. ఆక్సిజన్ వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తెజస్ నందలాల్ పవర్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్లు జీవన్, నర్సింహారావు, ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు కిరణ్, నందకిశోర్, రాధ, మునిసిపల్ చైర్మన్ నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్, ఉపాధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.