కరోనా కట్టడికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-31T04:19:56+05:30 IST

కరోనా కట్టడికి అందరూ సహ కరించాలని ఎస్పీ అపూర్వారావు కోరారు.

కరోనా కట్టడికి సహకరించాలి
పెబ్బేరులో వాహనదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

 - అనవసరంగా తిరిగే వారికి జరిమానాలు విధించండి

- ఎస్పీ అపూర్వారావు

పెబ్బేరు, మే30:   కరోనా కట్టడికి అందరూ సహ కరించాలని ఎస్పీ అపూర్వారావు కోరారు. పెబ్బేరు మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ జరుగుతున్న తీరును ఆదివారం ఎస్పీ పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన కొందరిని ఆపి వారితో మాట్లాడారు. అనంతరం  ఆమె మాట్లాడుతూ పోలీసులు కఠినంగా వ్యవహరించి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశిం చారు. లాక్‌డౌన్‌ సమయంలో అవనసరంగా బయట కు తిరిగే వాహనదారులకు జరిమానా విధించాలని ఆదేశించారు. ఆమె వెంట ఎస్‌ఐ రాము, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

పాన్‌గల్‌: కరోనా మహమ్మారి నిర్మూలనకు  ప్ర భుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమి స్తే చర్యలు తప్పవని ఎస్సై విజయభాస్కర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వాహనాదారు ల కు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించాలన్నారు.   అత్య వసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. కార్యక్ర మంలో ట్రైనీఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

మేము మీ కోసం బయట ఉంటున్నాం

 పెద్దమందడి: మీ కోసం మేము బయట విధు లు నిర్వర్తిస్తున్నాం..  మీరు మీ కోసం మీ కుటుంబ కోసం బయటకు రావొద్దని ఎస్సై రాజు ప్రజలను కోరారు. ఆదివారం మండలంలోని  గ్రామాలలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ లాక్‌డౌన్‌కు అందరూ సహక రించాలని, ఎవరు బయటికి రోడ్లపైకి రావద్దని ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండాలని అన్నారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాల న్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఎస్సై విజయ్‌, సిబ్బంది  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T04:19:56+05:30 IST