ధిక్కారం..
ABN , First Publish Date - 2021-02-07T03:49:55+05:30 IST
రియల్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

- గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు బుట్టదాఖలు
- కేసరి సముద్రానికి ఎసరు పెట్టిన టీఆర్‌ఎస్ నాయకుడు
- అర్ధరాత్రి మట్టిని తరలించి ఎఫ్‌టీఎల్‌ను కూల్చిన ప్రబుద్ధుడు
- ‘రియల్ మాఫియా’ ఆగడాలపై కలెక్టర్ గరం గరం
- ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసిన యంత్రాంగం
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రియల్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చట్టాలను అమలు చేసే రాజ్యాంగ వ్యవస్థలను కూడా ధిక్కరిస్తూ రాత్రికి రాత్రే నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం శివారులోని కేసరి సముద్రం చెరువును కూల్చివేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోం ది. కేసరి సముద్రంతోపాటు పుట్నాలకుంట, సద్దాల్‌సాబ్‌కుంట, తుమ్మలకుంట చెరువులు కబ్జాకు గురవు తున్న అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కూడా కేసు నమోదైంది. కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల కార్యదర్శులతో సంయుక్త వి చారణ జరగగా, కేసరి సముద్రంలో 37 చోట్ల ఆక్రమణలు జరిగాయని అధికారికంగా నివేదిక కూడా ఇ చ్చారు. కేసరి సముద్రం ఆక్రణలను తొలగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్న నేపథ్యంలోనే, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక నాయకుడు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వందలాది టిప్పర్లలో అ క్రమంగా మట్టిని తరలించి చెరువును పూడ్చివేయడాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా పరిగణిస్తోం ది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న విశేష అధికారాల నేపథ్యంలో, ట్రై బ్యునల్ జారీ చేసిన ఆదేశాలకు భిన్నంగా ఒక గల్లీస్థాయి నాయకుడు వ్యవహరించడం వెనక ప్రోద్బలం ఎవరిదనే విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్, రెవెన్యూ వ్యవ స్థలను బేఖాతరు చేయడమే కాదు, బరితెగింపుగా వ్యవహరించి అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేసిన సదరు వ్యక్తిపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జర పాల్సిందిగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో వారు హుటాహుటిన అక్కడికి పరుగు లు పెట్టిన అధికారులు, నిబంధనల ఉల్లంఘనే నిజమేనని ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశా రు. అయితే గతంలో కూడా నీటి వనరులను ధ్వంసం చేసిన విషయంలో సదరు గల్లీ నాయకుడుపై కేసు ఉండటం విశేషం.