ఎంజేఆర్‌ ట్రస్ట్‌ నిధులతో జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం

ABN , First Publish Date - 2021-10-29T04:27:17+05:30 IST

శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని తొలగించి ఎంజేఆర్‌ ట్రస్టు ని ధులతో కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు.

ఎంజేఆర్‌ ట్రస్ట్‌ నిధులతో జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి

- కలెక్టర్‌తో కలిసి కొత్త భవనం నిర్మించే ప్రదేశం పరిశీలన

- కలెక్టరేట్‌ భవన సముదాయం పనులు వేగవంతం చేయాలని ఆదేశం


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని తొలగించి ఎంజేఆర్‌ ట్రస్టు ని ధులతో కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొత్త భ వనం నిర్మించాల్సిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం పూ ర్తిగా శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో తమ ట్రస్టు ఆధ్వర్యంలో అధునా తన భవన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఎంజేఆర్‌ ట్రస్టు ఆధ్వర్యం లో ప్రతి మండలంలో అధునాతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామని, ఈ క్రమం లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దాల నే సంకల్పంతో పక్కా భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొల్లాపూర్‌ చౌరస్తాకు చేరుకున్న ఎమ్మెల్యే మర్రి అక్కడ మాజీ మంత్రి మహేంద్రనాథ్‌ కాంస్య విగ్రహ నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలో ఆర్కిటెక్చర్లకు పలు సూచనలిచ్చారు. మ హేంద్రనాథ్‌ చౌరస్తా పూర్తిగా తన సొంత నిధులతో నిర్మాణం చేపడుతానని జిల్లాలో ని నాలుగు నియోజకవర్గాల ప్రజలు గర్వపడేలా దీనిని రూపొందిస్తానని ఆయన చె ప్పారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పనులు మందకొడిగా నడుస్తుండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు మాధవరెడ్డి, బాబురావు, కేశవులుగౌడ్‌, భాస్కర్‌గౌడ్‌, బుసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కావలి శ్రీను, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 


సీసీ రోడ్డు పనులు ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీ 10వ వార్డులో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గురువారం మునిసిల్‌ చైర్‌ పర్సన్‌ కల్పనతో కలిసి వార్డును సందర్శించిన ఎమ్మెల్యే పనులకు సంబంధించిన శిలాఫలకానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. అంతకు మందు వార్డు కౌన్సిలర్‌ బాదం సునీత బాణాసంచా చాల్చి చిన్నారుల స్వాగత కోలాటం నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబురావు, వార్డు కౌన్సిలర్‌ బాదం సునీత, కౌన్సిలర్లు జక్కా రాజ్‌కుమార్‌, శ్రీనివాసులు, పద్మమ్మ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్‌, వార్డు నాయకులు నాయకులు బాదం నరేందర్‌, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.   

 


Updated Date - 2021-10-29T04:27:17+05:30 IST