కుట్రపూరితంగానే తొలగింపు

ABN , First Publish Date - 2021-05-03T04:18:39+05:30 IST

ఈటల రాజేందర్‌ను మం త్రి పదవి నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో దామరగిద్ద లోని అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు.

కుట్రపూరితంగానే తొలగింపు
దామరగిద్దలో రాస్తారోకో చేస్తున్న బీసీ నాయకులు

- మంత్రి పదవి నుంచి ఈటల తొలగింపుపై బీసీ సంఘాల ఆగ్రహం

- సీఎం కేసీఆర్‌ తీరుపై జిల్లా అంతటా నిరసనలు


దామరగిద్ద, మే 2 : ఈటల రాజేందర్‌ను మం త్రి పదవి నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో దామరగిద్ద లోని అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంఘం జిల్లా నాయకులు సుభాష్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా నాయకులు మొగులప్ప మాట్లాడు తూ భూ కబ్జాల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్ర పూరితంగానే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారన్నారు. ఈటల రాజేంద ర్‌పై వస్తున్న భూ కబ్జాల ఆరోపణలు పచ్చి అబ ద్ధమన్నారు. వ్యాపారాల్లో ఆస్తులు సంపాదించార న్నారు. కోట్లాది కోట్లు సం పాదించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నా రన్నారు. రాజకీయంలో బీసీ నాయకుడు ఎదుగు దల చూసి ఓర్వలేనిత నంతో లేనిపోని ఆరోపణ లు చేస్తున్నారన్నారు. బీసీలం ఐక్యమై ముఖ్యమం త్రి అహంకారాన్ని దింపుతామన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు సత్యనారాయణ, పరిపూర్ణం, వెంకట్రాములు, అశోక్‌, ఎంపీటీసీ అంజి, శ్రీని వాస్‌, లక్ష్మీనారాయణ, బీసీ నాయకులు ఉన్నారు. 


ఈటలపై ఆరోపణలు అవివేకం


మక్తల్‌ : సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగానే మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారని ముదిరాజ్‌ యువసేన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎలిగండ్ల వెంకటేష్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు పస్పుల రవి అన్నారు. ఆదివారం మక్తల్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 20ఏళ్ల నుంచి కలిసి పనిచేసిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్‌ అ ధ్యక్షుడు విజయ్‌, నాయకులు చంద్రప్ప, సూరి, శాంతప్ప, శివానంద్‌, శ్రావణ్‌, నర్సిములు, వెంకటేష్‌, మూర్తి, మహేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-05-03T04:18:39+05:30 IST