అభివృద్ధిని ఓర్వలేకే కుట్రలు

ABN , First Publish Date - 2021-02-06T04:09:37+05:30 IST

ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గం లో దళితుల అభివృద్ధికి చేసే కృషిని ఓర్వలేక కొందరు స్థానికేతరులు కుట్రలు పన్నుతున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేకే కుట్రలు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి

- జడ్పీ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్రవరి 5: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి చేసే కృషిని ఓర్వలేక కొందరు స్థానికేతరులు కుట్రలు పన్నుతున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజినేపల్లి గురుకుల పాఠశాల వనపర్తికి, జిల్లా కేం ద్రంలోని గురుకుల డిగ్రీ కళాశాల షాద్‌నగర్‌కు కేవలం వాటి ప్రిన్సిపాల్స్‌, ఉపా ధ్యాయుల ప్రయాణ సౌకర్యం కోసమే  తరలించారని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే సీఎం, గురుకులాల కార్యదర్శితో మాట్లాడి ఇక్కడికి తెచ్చేందుకు ప్రయత్నించి సఫలీకృతమైనారన్నారు. ఎమ్మెల్యే కృషి ఫలించడంతో పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులమని చెప్పుకుంటున్న కొందరు క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం సరికాదన్నారు. బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్‌ మాట్లాడు తూ జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి దళిత మహిళకు ఇచ్చి ఎమ్మెల్యే మర్రి ఈ ప్రాంత దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. ఎమెల్యే కృషితోనే బిజినేపల్లి, నాగర్‌క ర్నూల్‌ గురుకులాలు తిరిగి ఇక్కడికి రాబోతున్నాయన్నారు. దీనిని చూసి జీర్ణిం చుకోలేని కొందరు కమీషన్ల కోసం బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు. ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  కౌ న్సిలర్‌ కావలి శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీశైలం, గురుకుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ జి ల్లా అధ్యక్షుడు మహేందర్‌, దళిత నాయకులు బత్తుల వెంకటేష్‌, రాదాకృష్ణ, బంగారయ్య, స్వామి, వెంకటయ్య, రాములు, కొత్త నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.    


ఎమ్మెల్యే మర్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

 బిజినేపల్లి గురుకుల పాఠశాల, నాగర్‌కర్నూల్‌ బాలికల డిగ్రీ కళాశాల తిరిగి తెచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు అందుకు సా నుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌, గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం దళిత నాయకు లు, ప్రజా ప్రతినిధులు వారి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.  బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్‌, కౌన్సిలర్‌ కావలి శ్రీనివాస్‌, దళిత సంఘల నాయకులు కొత్త నాగేష్‌, మహెందర్‌, రాధాకృష్ణ, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-06T04:09:37+05:30 IST