కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ను పటిష్టం చేయాలి

ABN , First Publish Date - 2021-10-20T05:02:37+05:30 IST

కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ విభాగాన్ని పటి ష్ఠం చేయాలని కిసాన్‌సెల్‌ జిల్లా చైర్మన్‌ ఎం జనార్దన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ను పటిష్టం చేయాలి
నియామకపత్రాలు అందజేస్తున్న దృశ్యం

- కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ ఎం జనార్దన్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 19 : కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ విభాగాన్ని పటి ష్ఠం చేయాలని కిసాన్‌సెల్‌ జిల్లా చైర్మన్‌ ఎం జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కిసాన్‌సెల్‌ మండల కిసాన్‌ చైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బాధ్యతలు తీసుకున్న వారు కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠత కోసం కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, మీడియా సెల్‌ ఇన్‌చార్జిబెనహర్‌, చంద్రశేఖర్‌, శివశంవకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


మండల కిసాన్‌ చైర్మన్‌లు 


మహబూబ్‌నగర్‌ మండల కిసాన్‌ చైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి, హన్వాడకు గంగిరెడ్డి, జడ్చర్లకు ఆర్‌ శ్రీధర్‌రెడ్డి, మిడ్జిల్‌కు బి కృష్ణయ్యగౌడ్‌, రాజాపూ ర్‌కు రమేశ్‌రెడ్డి, బాలానగర్‌కు మురళీధర్‌రెడ్డి, నవాబ్‌పేటకు రామ్మోహన్‌గౌడ్‌, దేవరకద్రకు శ్రీని వాస్‌రెడ్డి, సీసీకుంటకు నరేందర్‌రెడ్డి, మూసాపే టకు లక్ష్మీనారాయణ, భూత్పూర్‌కు నాగిరెడ్డిలను నియమించారు. 

Updated Date - 2021-10-20T05:02:37+05:30 IST