మోదం.. ఖేదం

ABN , First Publish Date - 2021-12-29T04:39:47+05:30 IST

ఇరిగేషన్‌ విషయంలో ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పెద్దగా లాభం చేకూరలేదు.

మోదం.. ఖేదం
కల్వకుర్తి నియోజకవర్గంలో తరచూ తెగిపోతున్న డీ82 కాలువ(ఫైల్‌)

ఈ ఏడాది వ్యవసాయం అంతంత మాత్రమే

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మెరుగు

అదనపు రిజర్వాయర్ల నిర్మాణం లేక స్థిరీకరణకు నోచుకోని ఆయకట్టు

ఆంధ్రప్రదేశ్‌ పెడుతున్న కొర్రీలతో పాలమూరు-రంగారెడ్డి పథకానికి చిక్కులు


నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ విషయంలో ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పెద్దగా లాభం చేకూరలేదు. వివిధ ఎత్తిపోతల పథకాలు ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు సంతృప్తినిస్తున్నా, అదనపు రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కడంతో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సహా జూరాలపై కూడా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడంతో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో ధైర్యంగా కరెంట్‌ ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆంరఽధప్రదేశ్‌ పెడుతున్న కొర్రీల కారణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పనులు నత్తనడకన తలపిస్తున్నాయి. 


తగినన్ని రిజర్వాయర్లు లేక ఇక్కట్లు

4 లక్షల 75 వేల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మోటార్ల సామర్థ్యానికి అనుగుణంగా కాల్వలు, స్టోరేజీ కెపాసిటీకి తగినన్నీ రిజర్వాయర్లు నిర్మించక పోవడంతో తరచు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జొన్నలబొగుడ, కోడేరు మండలాల నుంచి వెల్దండ మండలం వరకు బ్రాంచ్‌ కెనాళ్లు తెగిపోయి, రైతులకు పంట నష్టం వాటిల్లు తోంది. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుని, ఆర్థికంగా కూడా అనేక కష్టాలు ఎదురవుతున్నాయి.


పాలమూరు ఎత్తిపోతలకు నిధుల సమస్య

రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని 12 లక్షలా 30 వేల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉమ్మడి జిల్లా వాసులను తీవ్ర ఆందో ళనకు గురి చేస్తు న్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణమే అక్ర మమని వైఎస్‌. జగన్‌ రెడ్డి ప్రభుత్వం కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖ రాయడంతో ఈ ప్రాజె క్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్స్‌ కంపెనీలు సంకో చిస్తున్నాయి. 


పాలకులకు పట్టని నిర్వాసితుల గోడు

జిల్లాలో ప్రధానంగా చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో సర్వం కోల్పోతున్న రైతాంగం పట్ల పాలక వర్గాలకు కనీస స్పందన కరువైంది. ఈ విషయమై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమౌ తోంది. కుడికిళ్లలో రెండుసార్లు భూమి కోల్పోయిన నిర్వాసితులు, డిండి లిఫ్టు ఇరిగేషన్‌లో ఐదేళ్ల కిందట భూములు ధారాదత్తం చేసిన వారు ప్రస్తుతం హైదరా బాద్‌, మహబూబ్‌నగర్‌లలో అడ్డా కూలీలుగా పని చేస్తున్నారు.


పాలమూరు-రంగారెడ్డి కోసం ఆందోళనలు

పాలమూరు ఉమ్మడి జిల్లాకు సా గునీరిచ్చే పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు భాగాలుగా చేపట్టిన జీవో నెం.72 ప్రకారం తక్షణం జూ రాల ఆధారిత ప్రాజెక్టు చేపట్టాలనే డిమాండ్‌తో పాలమూరు అధ్యయన వేదిక 2021లో పలు ఆందోళనలు నిర్వహించింది. అదేవిధంగా కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులను కేంద్రం స్వా ధీనం చేసుకునేలా రూపొందించిన గెజిట్‌ని కూడా ఈ వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసింది. రిటైర్డ్‌ ఇంజనీర్లు, కలిసొచ్చే ప్రజా సంఘాలతో కలిసి ఈవేదిక కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌ సహా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించింది. 


జీవో నంబర్‌ 72 కోసం జలసాధన సమితి ఆందోళన

జీవో నంబర్‌ 72 అమలు చేయ డం ద్వారా పాలమూరులోని దుర్భిక్ష ప్రాంతాలైన నారాయణపేట, వికారా బాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాగునీటి తాగునీటి ఎద్దడి తీరుతుం దని, తక్షణం ఈ పథకాన్ని చేపట్టాల నే డిమాండ్‌తో జలసాధన సమితి ఈయేడాదంతా సభలు, సమావేశాలు నిర్వహించింది. నారాయణపేట, వికా రాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సమితి సమావేశాలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించింది. రాష్ట్ర ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతా న్ని అన్యాయం చేస్తోందనే ఆందోళ నను వ్యక్తం చేసింది.


కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం కోసం ఉద్యమం

పాలమూరు ఎత్తిపోతల పథకం జాప్యమైన నేపథ్యంలో ఈయేడాది కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలనే డిమాండ్‌ బలం గా తెరమీదకు వచ్చింది. నికర జలాల కేటాయింపులతో రూపొందించి, ఉ మ్మడి రాష్ట్రంలో అనుమతులు పొం దిన ఈ పథకాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేఆర్‌ఎంబీ చైర్మన్‌ పరమేశానికి వినతి పత్రం అందజేశారు. బీజేపీ ఆధ్వ ర్యంలో ఈ పథకం కోసం ఆందోళ నలు నిరంతరాయంగా కొనాగు తున్నాయి. అక్టోబరు మాసంలో ఈ పథకం కోసం నారాయణపేట జిల్లా బీజేపీ నాయకులు పాదయాత్రలు కూడా నిర్వహించారు. ఈ పథకం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తా మని ఈ ప్రాంత బీజేపీ స్పష్టంగా పేర్కొనడం రాబోయే యేడాది కూడా ఈ పథకం కోసం ఆందోళన కొన సాగుతుందన్న సంకేతాన్ని స్తున్నాయి.


గట్టు ఎత్తిపోతల పథకం..

జోగుళాంబ గద్వాల జిల్లాలో తాగు, సాగునీటికి ఇప్పటికీ ఇబ్బం దులు పడుతున్న గట్టు, కేటీదొడ్డి మం డలాల్లోని 33 వేల ఎకరాలకు నీరం దించేందుకు గట్టు ఎత్తిపోతల పథకా నికి 2018 జూన్‌ 29న శంకు స్థాపన చేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథ కంలో భగమైన ర్యాలంపాడు జలాశ యం వద్ద ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మిం చి, అక్కడి నుంచి 6.30 కిలో మీటర్ల మేరకు నీటిని పంపింగ్‌ చేస్తారు. మల్లాపురం తండా వద్ద 1.32 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తారు. ఆ రిజర్వాయర్‌ ఎడమ, కుడి కాల్వల కింద 15 డిస్ర్టిబ్యూ టరీలు నిర్మించి 33 వేల ఎకరాలకు నీరందిస్తారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం రూ.623 కోట్లు అవసర ముందని ప్రతిపాదనలు పంపగా, ఈ నెలలో ప్రభుత్వం రూ.580 కోట్లకు అంగీకారం తెలిపింది. అయితే టెండర్లు వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చినా, ఇంకా అడుగులు మాత్రం పడటం లేదు.



Updated Date - 2021-12-29T04:39:47+05:30 IST