ప్రభుత్వ స్థలం ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-21T03:35:56+05:30 IST

గద్వాల జిల్లా గట్టు మండల కేం ద్రంలోని ప్రభుత్వ స్థలంలో ఒకరు పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశారని, మరొకరు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని సర్పంచ్‌ ధనలక్ష్మి బుధవారం కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు.

ప్రభుత్వ స్థలం ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ప్రభుత్వ భూమిలో నిర్మించిన పెట్రోల్‌బంక్‌ ఇదే..

గద్వాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : గద్వాల జిల్లా గట్టు మండల కేం ద్రంలోని ప్రభుత్వ స్థలంలో ఒకరు పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశారని, మరొకరు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని సర్పంచ్‌ ధనలక్ష్మి బుధవారం కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. గట్టు మండల కేంద్రంలోని సర్వే నెంబరు 15లో 16 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం పక్కనే 19, 20 సర్వే నెంబర్లలో ప్రైవేట్‌ వ్యక్తులకు కొంత భూ మి ఉంది. వారు తమ భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కూడా తమదేనని చూపించి సొమ్ము చేసుకుంటున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొ న్నా రు. వారిలో సర్వే నెంబర్‌  19కి చెందిన యజమాని ప్రభుత్వ భూమిలో పెట్రో ల్‌ బంక్‌ ఏర్పాటకు ఎకరం స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని తెలి పారు. సర్వే నెంబర్‌ 20కి చెందిన యజమాని ప్రభుత్వ భూమిలో 20 ప్లాట్లు చేసి విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఆక్రమణకు గురైన రెండెకరాల భూమి విలువ కోటిన్నర రూపాయల విలువ ఉంటుందని అంచనా. 

 

Updated Date - 2021-01-21T03:35:56+05:30 IST