సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-12-15T05:36:18+05:30 IST
జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన మండలంలో కూడా పర్యటించనున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

పెద్దమందడి, డిసెంబరు 14 : జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన మండలంలో కూడా పర్యటించనున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. మండలంలోని వీరాయిపల్లి శివారులో వేరుశనగ పరిశోధన కేంద్రం నిర్మాణం కోసం శంకు స్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శంకుస్థాపకకు సంబంధించిన పనులను పర్యవేక్షిం చారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షుడు రాజా ప్రకాష్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, జిల్లా అధికారులు తదితులు పాల్గొన్నారు.