రైతుల ఆలోచనా దృక్పథం మారాలి

ABN , First Publish Date - 2021-12-08T04:58:24+05:30 IST

రైతుల ఆలోచ నా దృక్పథం మారాలని, ఆరుతడి పంటలవైపు మళ్లాలని కలెక్టర్‌ వల్లూరి క్రాంతి సూచించారు.

రైతుల ఆలోచనా దృక్పథం మారాలి
వ్యవసాయ శాఖ బ్రోచర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌

- ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

- కలెక్టర్‌ వల్లూరి క్రాంతి

గద్వాల రూరల్‌, డిసెంబరు 7 : రైతుల ఆలోచనా దృక్పథం మారాలని, ఆరుతడి పంటలవైపు మళ్లాలని కలెక్టర్‌ వల్లూరి క్రాంతి సూచించారు. మండలంలోని జమ్మిచేడు గ్రామంలోని మెప్మా కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీ లించి, రైతులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు. రబీలో వేసిన వరికి కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయం లో చేతికి వచ్చే వేరుశనగ, మినుములు, ఉలవలు తదితర పంటలు పండించాలని సూచించారు. పంటమార్పిడితో దిగుబడి కూడా పెరుగుతుందని వివరించారు. ఇందుకు సంబందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో వ్వవసాయశాఖ అధికారి గోవిందనాయక్‌, ఏడీఏ సక్రియా నాయక్‌, జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఏవో సుచరిత, నాయకులు సురేష్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:58:24+05:30 IST