పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-29T04:51:57+05:30 IST
బ్యాంకులు అందించే రుణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, అక్టోబరు 28 : బ్యాంకులు అందించే రుణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్వీ ఈవెంట్ హాలులో ఏర్పాటు చేసిన రుణ విస్తరణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్ఞలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలు, పీఎం స్వీనిధి, మహిళా గ్రూపుల సభ్యులకు, వీధి వ్యాపారులకు, రైతులకు వ్యవసాయ అనుబంధ, వ్యక్తిగత రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధానంగా జిల్లాలోని చేనేత కార్మికులకు ముద్ర రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరినట్లు చెప్పారు. ఎన్నో పథకాల కింద అతి తక్కువ వడ్డీతో వ్యక్తిగత యూనిట్లు పెట్టుకోవడానికి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ముద్ర, పీఎం స్వానిధి రుణాలకు ధరఖాస్తులను స్వీకరించి, అర్హత కలిగిన వారికి రుణాలు అందించా లని కోరారు. లబ్దిదారులు సక్రమంగా వాయిదాలు చెల్లించాలని సూచించారు. వ్యాపారం కోసం తీసు కున్న రుణాలను అందుకే వాడాలని చెప్పారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా ఎంపీకైన ఎస్‌హెచ్‌జీ మహిళా గ్రూపు సభ్యులకు 15.88 కోట్ల రూపాయల రుణ చెక్కును అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డీఆర్డీఏ ఉమాదేవి, ఎల్డీఎం సురేష్ కుమార్, ఎస్బీఐ ఏజీఎం మధుబాబు, ఏపీడీవీబీ ఆర్ఎం శామ్యూల్, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.