చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-10-04T04:02:29+05:30 IST
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్యాలయం ముందు జరిగే ధర్నాకు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్ కోరారు.
నారాయణపేట, అక్టోబరు 3 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్యాలయం ముందు జరిగే ధర్నాకు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లోని భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్‌కు నిధులను విడుదల చేసి సంక్షేమ బోర్డుకు అడ్వైయిజరి కమిటీని నియమించాలని, కార్మికులు మరణిస్తే రూ.10 లక్షలు ఇవ్వాలని ధర్నా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
మక్తల్ : మునిసిపల్ కార్మికులకు 30శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల మునిసిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం మక్తల్ మునిసాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిట్‌మెంట్ కోసం విడుదల చేసిన జీవో నెం.60ద్వారా మునిసిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. 2014లో ప్రకటించిన 10వ పీఆర్‌సీ ప్రకారం 30శాతం అమలుపర్చాలని నిర్ణయం తీసుకుందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఫిట్‌మెంట్ ఇవ్వకుండా కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈశ్వరయ్య, రాములు, శంశుద్దీన్, మూర్తి, మారెప్ప, కృష్ణయ్య, రాజు, రామలింగప్ప, గంగన్న, నర్సిములు, బాలస్వామి, అమ్మక్క, మహేశ్వరమ్మ, ఆశన్న పాల్గొన్నారు.
మాగనూర్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేడు చేట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం మండల కార్యదర్శి భ్యాగరి నరసింహులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన గోడ పత్రికను ఆదివారం కార్మికులతో కలిసి విడుదల చేశారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లైమ్స్‌ను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబా నికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయ లడ్డు, బాల్‌దా స్ వెంకటయ్య, బాల్‌దాస్ నరసింహులు, కొలుపు నరసింహ పాల్గొన్నారు.