మొదటి ప్రాధాన్య ఓటుతోనే చిన్నారెడ్డి గెలుపు

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి విజయం సాధించనున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు.

మొదటి ప్రాధాన్య ఓటుతోనే చిన్నారెడ్డి గెలుపు
మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 14: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి విజయం సాధించనున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీకి గుణపాటం కానున్నా యన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తొలిసారి బారులు తీరి ఓట్లు వేశారని, కాంగ్రెస్‌, బీజేపీలపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని అన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబే దుల్లా కొత్వాల్‌, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, వినోద్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-14T05:30:00+05:30 IST