బాలల హక్కులను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-11-10T04:51:14+05:30 IST

బా లల హక్కులను పరిరక్షించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ కోరారు.

బాలల హక్కులను పరిరక్షించాలి
వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- వాల్‌పోస్టర్‌ విడుదల

నాగర్‌కర్నూల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : బా లల హక్కులను పరిరక్షించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ కోరారు. న వంబరు మాసంలో నిర్వహించే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సమగ్ర బాలల పరిరక్షణ పథకం లో భాగంగా జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ వా రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలకు తమ హక్కులపై అవగాహ న కల్పించడంతోపాటు వారికి వివిధ అంశాలను ఆట, పాటల పోటీలను నిర్వహిస్తామన్నారు. ఆడపి ల్లలను రక్షించుకుందాం, చదివిద్దాం అనే నినాదంతో చేపట్టే కార్యక్రమానికి సంబంధించి సంతకాల సేక రణ బ్యానర్‌పై మొదటి సంతకం చేశారు. అందరు బాధ్యతగా సంతకాలు చేసి ప్రజలను చైతన్యవంతు లను చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షే మాధికారి టీయు.వెంకటలక్ష్మి, డీసీపీవో నిరంజన్‌, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ వై.లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రెస్‌క్లబ్‌ స్థలాన్ని కాపాడాలి

-   కలెక్టర్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని బస్టాండు సమీపంలో ప్రెస్‌క్లబ్‌కు కేటాయించిన స్థలాన్ని కా పాడాలని జర్నలిస్టులు కలెక్టర్‌ పి.ఉయద్‌కుమార్‌ను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ లో కలెక్టర్‌ను కలిసిన జర్నలిస్టులు వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో అప్పటి గ్రామ పంచాయతీ బస్టాండు సమీ పంలోని సర్వే నెంబరు 332లో 176చదరపు గజాల స్థలాన్ని ప్రెస్‌క్లబ్‌ నిర్మాణానికి కేటాయించిందన్నా రు. అయితే ప్రస్తుతం ప్రెస్‌క్లబ్‌ స్థలంలో ఆర్టీసీ సం స్థ అక్రమంగా వాణిజ్య దుకాణాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ చేపడుతు న్న అక్రమ నిర్మాణాలపై మునిసిపల్‌, ఆర్డీవో కార్యాల యాల్లో ఫిర్యాదు చేశామని, దీనిపై చొరవ తీసుకుని ప్రెస్‌క్లబ్‌కు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కందికొండ మోహన్‌, పి.వెంకటస్వామి, సత్యం, మాదవరెడ్డి, శ్యాంసుందర్‌, శ్రీనివాస్‌బాబు, వెంకటేష్‌, హకీం కిశోర్‌, దశరథం, సహదేవ్‌, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T04:51:14+05:30 IST