బాల్య వివాహాలు నిరోధించాలి
ABN , First Publish Date - 2021-05-21T04:58:16+05:30 IST
బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ వెల్లడించారు.

- కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్
నాగర్‌కర్నూల్, మే 20 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ వెల్లడించారు. గురువారం బాల్యవివాహాల నిరోధానికి కలెక్టర్ అ ధ్యక్షతన వెబ్ ఎక్స్ ద్వారా వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఉన్నందు వల్ల అక్కడకక్కడా బా ల్య వివాహాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందు కోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏ ర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే జిల్లా అధికారు లకు సమాచారమందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రా మంలో అవగాహన కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామంలో ట్రాక్టర్లను వినియోగించుకునే సందర్భంలో వాటికున్న మైక్ ద్వారా బాల్య వివాహాలు నిరోధించడానికి అవగాహన పాటలను గ్రామంలో విన్పించాలన్నారు. కొవిడ్‌పై బాలలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్యవి వాహాలు నిరోధానికి టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. జిల్లాలో కొన్ని నెలలుగా 19 బాల్యవివాహాలను అధికారుల కృషితో నిరోధించామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందిన వారి పిల్లలను ఎవరైనా చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వాటిపై గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిఘా ఉంచాలని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బాలల పరిరక్షణ సమితి చైర్మన్ లక్ష్మణ్‌రావు, బాల్య వివాహాలు నిరోధానికి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ నుంచి బచ్పన్ బచావో ఆందోళన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు బాల్యవివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వెంకటలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారిణి రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్, అన్ని మండలాల ఎంపీడీవోలు, అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.