అంగరంగ వైభవంగా రథోత్సవం

ABN , First Publish Date - 2021-12-20T04:26:27+05:30 IST

పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వేలాది మంది భక్తజన సందోహం మద్య అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు.

అంగరంగ వైభవంగా రథోత్సవం
రథాన్ని లాగుతున్న భక్తులు

కొనసాగుతున్న పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

రథాన్ని లాగడానికి పోటీపడిన భక్తులు

మక్తల్‌, డిసెంబరు 19 : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వేలాది మంది భక్తజన సందోహం మద్య అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం తూర్పు నుంచి పడమటి వైపు ఉన్న చిన్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు చేరుకుంది. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మళ్లీ యథా స్థానానికి తీసుకొచ్చారు. అంతకుముందు స్వామివారి ఉత్సవ మూర్తిని రథం వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. రథం చుట్టు ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామి వారిని రథంపై ఉంచి రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా శనివారం రాత్రే వివిధ గ్రామాల ప్రజలు పట్టణానికి చేరుకొని బస చేశారు. శబరికాలనీ, రాఘవేం ద్ర కాలనీ, సంగంబండ రోడ్‌, మార్కెట్‌ సముదాయం ఇలా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భక్తులు స్వామివారికి పిండి వంటలు చేసి నైవే ద్యాలు సమర్పించారు. సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 167పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, తెలుగు దేశం జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నిజాంపాషా, ఎంపీపీ వనజ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, పుర చైర్మన్‌ బాల్చెడ్‌ పావనీ దంపతులు, వైస్‌ చైర్మన్‌ అఖిల దంపతులు, వార్డు కౌన్సిలర్‌లు, పుర కమి షనర్‌ రాజయ్య దంపతులు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వి.శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి, ప్రశాంత్‌ కుమార్‌రెడ్డితో పాటు వీహెచ్‌పీ, ఇతరత్ర సంఘాల నాయకులు స్వామివారిని దర్శించుకొని మొ క్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ తరపున ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. అదే విధంగా విద్యుత్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. మక్తల్‌ ఆర్యవైశ్య సంఘం నాయ కుడు కట్ట సురేష్‌కుమార్‌ తన తల్లిదండ్రులు శారదమ్మ, జయరాములు జ్ఞాపకార్థం దాసంగాలు పెట్టే భక్తుల సౌకర్యార్థం ఐదు  గ్రైండర్లు ఏర్పాటు చేశారు. అంతకు ముందు సురక్ష ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో దాతలు దామోదర జువెలర్స్‌, అవి నాష్‌ ఫ్యామిలీ  రెస్టారెంట్‌, వెంకటేశ్వర మెడికల్‌ సహకారంతో 8500 మాస్కులు పంపిణీ చేయడం తో పాటు భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో సురక్ష ఫౌండేషన్‌ సభ్యులు రామకృష్ణారెడ్డి, జగదీష్‌, నరేందర్‌, అంబదాస్‌, భరత్‌, రాజు, నర్సింహా, తిరుమలేష్‌, నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు  ప్రశాంత్‌కుమార్‌, రాజుల ఆశిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు వర్కటం జగన్నాథ్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T04:26:27+05:30 IST