పీఆర్‌ఎల్‌ఐకి కాసుల కష్టం

ABN , First Publish Date - 2021-09-03T04:10:14+05:30 IST

దక్షిణ తెలంగాణలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపొందించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐ) నిధుల లేమి వెంటాడుతోంది..

పీఆర్‌ఎల్‌ఐకి కాసుల కష్టం
నార్లాపూర్‌ హెడ్‌వర్క్స్‌ వద్ద మోటార్ల బెడ్‌ కోసం జరుగుతున్న ఏర్పాట్లు

- ఎలక్ర్టో మెకానికల్‌ పనులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు విడుదలలో జాప్యం

- అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నందున సంకోచం

- నిధుల కొరతతో పనుల పురోగతికి ఆటంకం


నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి) : దక్షిణ తెలంగాణలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపొందించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐ) నిధుల లేమి వెంటాడుతోంది.. దీని మూలంగా డిసెంబరు నాటికి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యం క్రమంగా వెనుకబడుతోంది.. అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా కింద పీఆర్‌ఎల్‌ఐని చేర్చడంతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అందాల్సిన రుణం మంజూరులో జాప్యమయ్యే విధంగా ఉండటంతో, పనులు మందగించే పరిస్థితి నెలకొన్నది.. 

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వికారా బాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీ రందించాలనే లక్ష్యంతో పీఆర్‌ఎల్‌ఐకి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చే సింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌, తీగల పల్లి, వట్టెం పంపుహౌస్‌లలో భారీ నీటి పంపింగ్‌ సామర్థ్యం గల మో టార్లను బిగించేందుకు డిజైన్‌ చేశారు. నార్లాపూర్‌, తీగలపల్లి, వట్టెం రిజర్వాయర్లలో 70 శాతం సివిల్‌ పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం కూడా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణం తీసుకోవడానికి అంగీకారం కూడా కుదిరింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లు కార్పొరేషన్‌ ద్వారా ప్రభు త్వానికి చేరిన విషయం తెలిసిందే. అయితే, కృష్ణా జలాల వినియో గం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కార్పొ రేషన్‌ ద్వారా అందాల్సిన రుణానికి అవరోధం ఏర్పడింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అక్రమంగా రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పీఆర్‌ ఎల్‌ఐపై అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో అనుమతి లేని ప్రాజెక్టు ల జాబితాలో ఈ పథకాన్ని చేర్చడం వల్ల ఎలక్ర్టో మెకానికల్‌ పనుల కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. డిసెంబరులో నార్లాపూర్‌ పంపుహౌ స్‌ నుంచి ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు పంప ులను ట్రయల్‌ రన్‌ చేయించాలని సాగునీటి శాఖ లక్ష్యంగా నిర్ణయిం చుకోగా ఇప్పటి వరకు మోటార్లకు సంబంధించి రూటర్లు, తదితర చి న్నచిన్న సామగ్రి మాత్రమే మూడు పంపుహౌస్‌లలోకి అందుబాటు లోకి వచ్చింది. నార్లాపూర్‌లో మోటార్లకు సంబంధించిన బేస్‌లు ఏర్పా టు చేసే ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. రిజర్వాయర్ల ని ర్మాణం దాదాపు పూర్తైన క్రమంలో మోటార్లు బిగించే ప్రక్రియ ఆల స్యం కావడం వల్ల వచ్చే ఏడాది డిసెంబరులోగా కూడా ఈ పథకం ద్వారా ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి ఏర్పడుతోందని కొం దరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ పథకంలో హెడ్‌వర్క్స్‌ వద్ద నాలుగు మో టార్లకు సంబంధించి మాత్రమే పనులు చేపట్టడం వెనుక ఆంత ర్యమేమిటో బోధపడటం లేదు.

Updated Date - 2021-09-03T04:10:14+05:30 IST