గంజాయి సాగు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-29T05:41:30+05:30 IST

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరేంద్రగౌడ్‌ తెలిపారు.

గంజాయి సాగు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
గంజాయి మొక్కలతో పట్టుబడిన వ్యక్తితో ఎక్సైజ్‌ పోలీసులు

కృష్ణా, అక్టోబరు 28 : గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరేంద్రగౌడ్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం మండలంలోని ఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన చిన్న తాయప్ప తన పచ్చిమిర్చి తోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో గురువారం దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలోని గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలు తమకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది రామారావు, కురుమయ్య, సూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:41:30+05:30 IST