వరి కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-30T04:08:04+05:30 IST

వరి కొనుగోలులో ఇంతకు ముందు వ చ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు కలెక్ట ర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.

వరి కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి
అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

-  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వరి కొనుగోలులో ఇంతకు ముందు వ చ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా  ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సుఖజీవన్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో వరి కొనుగోలు సందర్భంగా ఏర్పడుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైస్‌ మిల్లర్ల సంఘాలు, ట్రాన్స్‌కో కాంట్రాక్టర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు జిల్లాలో వరి ధా న్యం అంతగా ఉండేది కాదని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సాగునీటి సదుపాయాల వల్ల గత రెండు, మూడు సంవత్సరాల నుంచి ఒక్కసారిగా ధాన్యం సాగు పెరిగి విప రీతంగా ఉత్పత్తి అవుతుందన్నారు. దీని వల్ల సరైన రైస్‌ మిల్లులు, గోదాములు లేకపో వడం వంటి కారణాలు, అదేవిధంగా కరోనా రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొ వాల్సి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల అవకతవకలు సైతం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి తప్పిదాలు పునరావృతమైతే సంబంధిత కొనుగోలు కేంద్రంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఉండాల్సిన అన్ని సౌ కర్యాలు ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. క్రితం సారి విపరీతంగా ధా న్యం వచ్చినా కొన్ని ఇబ్బందులతో బయటపడి రైతులందరికీ సకాలంలో డబ్బులు చె ల్లించగలిగామన్నారు. అది ప్రతీ ఒక్కరి సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. ఈసారి వరికి మద్దతు ధర ఏగ్రేడ్‌ రకం క్వింటాల్‌కు 1960, బిగ్రేడ్‌ రకం 1940 ధర చెల్లించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత పంటలో సేకరించిన ధాన్యం ఇంకా పూర్తిగా మిల్లింగ్‌ జరగలేనందున, మిల్లులు కొరత వల్ల ఈ సారి సగం ధాన్యం ఇతర జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా సిద్ధం కావాల్సిందిగా సూచించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి మాట్లాడుతూ రైతులు ఒకే రకమైన పంటను కాకుండా వివిధ రకాలైన పంటలను సాగు చేసి ఎక్కువ లబ్ధి పొందాలని కోరారు. ఇదే విషయాలపై రైతులకు అర్థమయ్యే విధంగా రైతు వేదికల్లో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ధనవంతులను చేయాలనుద్దేశంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూమి శాతం విపరీతంగా పెరిగిందన్నారు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌ వంటి అన్ని సౌకర్యాలతో పాటు రైతుబంధు అమలు చేయడం వల్ల జిల్లా నుంచి వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు తరలింపులో తమకు ఎదురైన సమస్యలను కలెక్టర్‌ తీసుకొచ్చారు. వాటిని తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ రమేష్‌, పీడీ డీఆర్‌డీఏ నర్సింగరావు, ఆర్‌డీవోలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సహకార సంఘాల అధ్యక్షులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-30T04:08:04+05:30 IST