కారు, బైకు ఢీ : వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-22T04:06:00+05:30 IST

కారు, బైకు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిందూపూర్‌ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది.

కారు, బైకు ఢీ : వ్యక్తి మృతి

కృష్ణా, ఆగస్టు 21 : కారు, బైకు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిందూపూర్‌ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా యాడ్లపూర్‌కు చెందిన సిద్ధ లింగప్ప బైక్‌పై అలంపల్లి నుంచి రాయచూరు వెళ్తుండగా, రాయచూరు నుంచి యాదగిరి వెళ్తున్న కారు ఢీ కొనడ గంతో సిద్ధ లింగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తర లించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు. 


Updated Date - 2021-08-22T04:06:00+05:30 IST