కొలువుల కల్వకోలు

ABN , First Publish Date - 2021-09-04T04:21:47+05:30 IST

మనిషిని చైతన్యం చేసి, తాను అనుకున్న రంగంలో కొలువును సంపాదించేలా తీర్చిదిద్దడం ఒక విజయం..

కొలువుల కల్వకోలు
కల్వకోలు గ్రామ వ్యూ

- చైతన్యం దిశగా గ్రామ యువత

- 80 శాతం అక్షరాస్యత

- గ్రామంలో 138 మందికి ప్రభుత్వ కొలువు

- కాకతీయుల కాలం నుంచే గ్రామానికి ఘన చరిత్ర 

- చుట్టూ చెరువులు ఉండటంతో పంటలతో గ్రామం కళకళ


కొల్లాపూర్‌ : మనిషిని చైతన్యం చేసి, తాను అనుకున్న రంగంలో కొలువును సంపాదించేలా తీర్చిదిద్దడం ఒక విజయం.. ఊళ్లో ఉన్న యువతనంతా చైతన్యం చేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయడం మరో అద్భుతం. అదే కల్వకోలు గ్రామస్థుల నైజం.. ఎదుటి వారిని చూసి స్ఫూర్తి పొంది, వారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటున్నారు.. కష్టపడి.. ఇష్టంగా చదివి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.. కాకతీయుల కాలం నుంచే    ఈ గ్రామానికి విశిష్ఠమైన చరిత్ర ఉన్నా, ఇప్పుడు మాత్రం ఆ గ్రామ యువత సాధించిన విజయాలపైనే అందరూ చర్చించుకుంటున్నారు.. పది మందికి ఆదర్శంగా నిలస్తున్న ఆ గ్రామ యువత కథే ఇది..

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌ గ్రా మం కొల్లాపూర్‌-నాగర్‌కర్నూల్‌ ప్రధాన రహదారిపై ఉంది. 2011 జాతీయ జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 4,500 జనాభా కలిగి ఉండేది. మొత్తం 60 శాతం అక్షరాస్యత న మోదైంది. అయితే ప్రస్తుత ఓటరు లిస్టు ప్రకారం గ్రామంలో జనాభా తొమ్మిది వేలకు చేరింది. మొత్తం 1,675 నివాస గృహా లు ఉండగా, 4,600 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 80 శా తంగా అక్షరాస్యత నమోదైంది. కల్వకోలు మారుమూల గ్రామ మైనా, ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. అదే నేడు ఆ గ్రామా నికి పేరు తెచ్చింది. ప్రభుత్వ కొలువులు రావని, ఉన్నా తమకు రావని ఇక్కడి యువత నిరుత్సాహ పడలేదు. ప్రభుత్వ కొలు వుల కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్‌ ఉద్యోగాల వైపు అ డుగులు వేశారు. కొందరు ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగాలు సా ధించి సేవలు అందిస్తుండగా, మరికొందరు ప్రైవేట్‌ రంగాల్లో పని చేస్తూ అందరితో శభాశ్‌ అనిపించుకుంటున్నారు. ప్రధా నంగా ఈ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది ప్రైవేట్‌ రంగాల్లో పని చేస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే క ళలను నమ్ముకున్న ఈ గ్రామ యువకులు పెయింటింగ్‌లో రా ణిస్తున్నారు. ఈ గ్రామం నుంచి దాదాపు 300 మంది వరకు హైదరాబాద్‌లో పెయింటర్లుగా స్థిరపడి, గుర్తింపు పొందారు.


ఉద్యోగాల్లో ఉన్నతమైన బాధ్యతలు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో లేని విధంగా కల్వకోలులో 98 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, 14 మంది పోలీస్‌ శాఖలో వివిధ క్యాడర్లలో, 18 మంది దేశ సరిహద్దుల్లో సైనికులుగా, విద్యుత్‌ శాఖలో మరో ఎనిమిది మంది సేవలందిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్నతమైన బా ధ్యతలు స్వీకరించి సంఘాన్ని, సమాజాన్ని ముందుకు నడి పించేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా ప్రై వేట్‌ రంగాల్లో ఈ గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఎక్కువే. వివిధ ప్రైవేట్‌ కంపెనీల్లో మేనేజర్లుగా, సూపర్‌వైజర్లుగా ఉన్నత స్థానాల్లో 150 మంది దాకా పని చేస్తున్నారు. వారంతా ఉద్యో గాలకే పరిమితం కాకుండా గ్రామంలో చదువుకున్న యువత కు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్యం వారిలో చైతన్యం నింపు తూ జీవనోపాధి మార్గాల అన్వేషణకు దారులు చూపిస్తున్నా రు. అలాగే అనేక మంది ఈ గ్రామం నుంచే పుస్తక రచయి తలుగా, పాటల రచయితలుగా, కవులు, కళాకారులుగా, సినీ రంగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా, కెమెరా మెన్లుగా, హైదరా బాద్‌లో బిల్డర్లుగా ప్రతిభ చాటుతున్నారు.


గ్రామ విశిష్టత

15వ శతాబ్దం కాకతీయుల కాలంలో నంది కోటీశ్వరస్వా మి కొలువైన గ్రామంగా కల్వకోలు ప్రసిద్ధి చెందింది. ఈ ఆ లయంలో ఏడు పొరలుగా ఉన్న పానుమట్టంతో లింగమ య్య కొలువుదీరాడు. ఆలయం ముందు నల్లరాతితో చెక్కిన నందీశ్వరుడు ఆకట్టుకుంటాడు. అలాగే మామిడికి ప్రసిద్ధి గాంచిన ప్రాంతంగా కొల్లాపూర్‌తో పాటు కల్వకోలుకు కూడా పేరుంది. గ్రామం చుట్టూ నాలుగు చెరువులు, మరో వైపు ఎంజీకేఎల్‌ఐ కాల్వ పారుతుండటంతో పచ్చని పంట పొలాల మధ్య ఈ గ్రామం కళకళలాడుతూ కనిపిస్తుంది.

Updated Date - 2021-09-04T04:21:47+05:30 IST