రెండూ ఒకే చోట
ABN , First Publish Date - 2021-05-09T04:17:39+05:30 IST
నారాయణపేట జిల్లా ఆసుపత్రికి కొవిడ్ పరీక్షల కోసం వ్యాక్సినే షన్ కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

వ్యాక్సినేషన్ .. కరోనా పరీక్షలు అక్కడే...
-జిల్లా ఆసుపత్రికి పెరుగుతున్న కొవిడ్ బాధితుల సంఖ్య
ఠినారాయణపేట క్రైం, మే 8 : నారాయణపేట జిల్లా ఆసుపత్రికి కొవిడ్ పరీక్షల కోసం వ్యాక్సినే షన్ కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరికి తోడు ఆసుపత్రికి వివిధ ఆరోగ్యకారణాల చేత ప్రసవం, స్కానింగ్ పరీక్షల కోసం వచ్చే వా రు కూడా ఎక్కువగానే ఉన్నారు. నారాయణపే ట జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసే ప్రదే శానికి ఐదడుగుల దూరంలోనే వ్యాక్సినేషన్ కేంద్రం ఉంది. ఓ పక్క కరోనా పరీక్షలు మరో పక్క వ్యాక్సినేషన్ కేంద్రం కొనసాగుతోంది. అసలు కొవిడ్ పరీక్షల కోసం వచ్చేవా రు ఎవరు? వ్యాక్సి నేషన్ కోసం వచ్చేవారు ఎవరన్నది తెలియని పరిస్థితి. కరోనా పరీక్షల కేంద్రాన్ని జిల్లా ఆ సుపత్రి పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠ శాలకు మార్పు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారు కొవిడ్ బారినపడే అవకాశం ఉండదు. లేదంటే కొవిడ్ రోగిగా మారే ప్రమాదం లేకపోలేదు.