బీజేపీ నాయకుల నిరసన

ABN , First Publish Date - 2021-11-01T04:09:33+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ నాయకులు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీ నాయకుల నిరసన
మూతికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

నారాయణపేట, అక్టోబరు 31 : హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ నాయకులు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు నాగూరావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలవాలని అన్నీ రకాల అధికార దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడిందన్నారు. ప్రజాప్రతినిధులు బాహటంగా డబ్బులు వెదజల్లారని ఓటర్లను కొని ప్రజా స్వామ్యాన్ని అపహ్యాసం చేశారని ఆరోపించారు. పోలింగ్‌ ముగిశాక ఓడిపోతామన్న భయంతో వీవీ ప్యాట్‌లను మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిద్ది వెంకట్రాములు, నందు నామాజీ, రఘువీర్‌. ప్లోర్‌ లీడర్‌ రఘుపాల్‌, కౌన్సిలర్లు రమేష్‌, రాఘవేంద్ర, ప్రమీలాబాయి, మల్లేష్‌, లక్ష్మణ్‌, రాము పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-01T04:09:33+05:30 IST