పీఆర్సీ ప్రకటన ఉద్యోగుల మీద ప్రేమతో కాదు: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-03-24T19:23:36+05:30 IST

ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే తమకు భవిష్యత్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక దొడ్డిదారులు చూసుకుందని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు.

పీఆర్సీ ప్రకటన ఉద్యోగుల మీద ప్రేమతో కాదు: డీకే అరుణ

మహబూబ్‌నగర్: ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే తమకు భవిష్యత్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక దొడ్డిదారులు చూసుకుందని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఒక్కో స్థానంలో రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. పీఆర్సీ ప్రకటన ఉద్యోగుల మీద ప్రేమతో కాదని..ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశ్యంతో పీఆర్సీ ప్రకటన చేశారన్నారు. బకాయిలు అన్నీ విడుదల చేసి వారికి మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని డీకే అరుణ తెలిపారు. 

Updated Date - 2021-03-24T19:23:36+05:30 IST