కేరళ నుంచి కశ్మీర్‌కు సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-02-07T03:32:32+05:30 IST

కేరళ రాష్ట్రం మలపురం పట్టణానికి చెందిన అశ్విన్‌, అమల్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోకి చేరుకుంది.

కేరళ నుంచి కశ్మీర్‌కు సైకిల్‌ యాత్ర
కేరళ నుంచి కశ్మీర్‌కు సైకిల్‌పై వెళ్తున్న అశ్విన్‌, అమల్‌

బాలబాలికల హక్కులపై అవగాహన కల్పిస్తున్న అశ్విన్‌, అమల్‌

ఉండవల్లి, ఫిబ్రవరి 6: కేరళ రాష్ట్రం మలపురం పట్టణానికి చెందిన అశ్విన్‌, అమల్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోకి చేరుకుంది. జాతీయ రహదారిపై సాగిపోతున్న వీరిని ఆంధ్రజ్యోతి పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. దేశంలో ఉన్న బాల బాలికల హక్కులు, వారి జీవన విధానంలో తీసుకోవలసిన అంశాలను తెలియజేసేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. గత నెల 22న మలపురం నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించామని వివరించారు. క్యూర్‌ చైల్డ్‌హుడ్‌ విత్‌ క్యాన్సర్‌, సేవ్‌ చైల్డ్‌హుడ్‌ విత్‌ డ్రీమ్స్‌ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రతీ ఒక్కరు బాలబాలికల సంరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు కన్న కలలను సాకారం అయ్యేందుకు పెద్దలు, ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-07T03:32:32+05:30 IST