సీపీఎం ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతి
ABN , First Publish Date - 2021-03-25T04:10:46+05:30 IST
మండల పరిధిలోని ఉడ్మల్‌గిద్ద గ్రామంలో బుధవారం సీపీఎం ఆధ్వ ర్యంలో భగత్‌సింగ్ 90వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

దామరగిద్ద, మార్చి 24 : మండల పరిధిలోని ఉడ్మల్‌గిద్ద గ్రామంలో బుధవారం సీపీఎం ఆధ్వ ర్యంలో భగత్‌సింగ్ 90వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూల మాలలువేసి నివాళ్లు అర్పించారు. సీపీఎం జిల్లా నాయకులు గోపాల్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్ర్యానికి తన జీవి తాన్ని త్యాగం చేశారన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రకాష్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు హన్మంతు, సీఐటీయూ, భీమేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, భీంషప్ప, రాములు, రవి, మల్లేష్, రాజేందర్, ఉప సర్పంచ్ హుస్సేన్ ఉన్నారు.