ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు : ఎమ్మెల్యే పట్నం

ABN , First Publish Date - 2021-02-06T04:36:58+05:30 IST

ప్రతీ తండా, గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు  :  ఎమ్మెల్యే పట్నం

మద్దూర్‌, ఫిబ్రవరి 5 : ప్రతీ తండా, గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూర్‌ మండలంలోని నందిగామ నుంచి వాల్యనాయక్‌తండా వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందన్నారు. గోకుల్‌నగర్‌లో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్‌ సత్యమ్మ, ఎంపీటీసీ అనిత, మాజీ జడ్పీటీసీ బాల్‌సింగ్‌నాయక్‌, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటయ్య, పార్టీ నాయకులు వీరేశ్‌గౌడ్‌, హన్మిరెడ్డి, వీరారెడ్డి, శివకుమార్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:36:58+05:30 IST