సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-24T04:25:37+05:30 IST

విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ చార్జి డీఈవో గోవిందరాజులు, ఎస్‌ఐ రాజేందర్‌ పేర్కొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నర్వ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ

ధన్వాడ/మరికల్‌, నవంబరు 23 : విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ చార్జి డీఈవో గోవిందరాజులు, ఎస్‌ఐ రాజేందర్‌ పేర్కొన్నారు. మంగళవారం ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గురుకుల పాఠశాలలో సైబర్‌ నేరాలపై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పట్టణాల్లో, వీధుల్లో, గ్రామాల్లో పాఠశాలలో సైబర్‌ అంబాసిడర్స్‌ను తయారు చేయడం వల్ల సైబర్‌ నేరాలను తగ్గించవచ్చాన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు సైబర్‌ నేరాలపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం రమేష్‌ శెట్టి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా మరికల్‌ మండలం కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైబర్‌ మెంటర్‌ టీచర్‌ బాలలింగయ్య ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి డీఈవో గోవిందరాజులు, సీఐ శివకుమార్‌, ధన్వాడ ఎస్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్‌ నేగాల్లు ఫొటో లను మార్పింగ్‌ చేసి ఇతరులకు షేర్‌ చేస్తే ఆందోళన చెందకుండా 1098, 100 నెంబర్‌లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం పాఠశాలకు మొదటి సారిగా వచ్చిన ఇన్‌చార్జి డీఈవోను ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్‌, తిమ్మారెడ్డి, గజ్జనంద్‌, అంజయ్య పాల్గొన్నారు.

నర్వ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఐ విజయభాస్కర్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మాఢ నమ్మకాలు, అంటరానితనం, రోడ్డు భత్రతా ట్రాఫిక్‌ నిబంధనలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. నీ నేస్తం ఫిర్యాదు బాక్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజేష్‌, ఎస్‌వో శిల్ప, మల్లేష్‌ పాల్గొన్నారు.

నారాయణపేట టౌన్‌ : ప్రతీ విద్యార్థి లక్ష్య సాధనలో ముందుకు సాగాలని జీడీసీవో పద్మ, ఎస్‌ఐ గోవర్దన్‌ పేర్కొన్నారు. మంగళవారం దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్‌ నేరాలు, డయల్‌ 100, మూఢ నమ్మకాలు, బాల్యవివాహలు, మహిళా రక్షణ తదిరత అంశాలపై అవగాహన కల్పంచారు. 




Updated Date - 2021-11-24T04:25:37+05:30 IST