బ్యాంకర్లు ప్లీజ్‌...

ABN , First Publish Date - 2021-12-31T06:04:41+05:30 IST

రైతుబంధు నిధులను బ్యాంకర్లు ఇతర లోన్లకు జమచేసుకోవద్దని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.

బ్యాంకర్లు ప్లీజ్‌...
వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- రైతుబంధు నిధులను ఇతర లోన్లకు జమ చేసుకోవద్దు

- జిల్లాలో 2లక్షల 2వేల ఖాతాలకు రూ.220 కోట్లు మంజూరు

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వెల్లడి


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 30 : రైతుబంధు నిధులను బ్యాంకర్లు ఇతర లోన్లకు జమచేసుకోవద్దని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టర్‌ రెవెన్యూ సమావేశ మందిరం నుంచి రైతుబంధు నిధుల జమపై వ్యవ సాయ అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. 2 లక్షల 2 వేలు రైతు ఖాతా లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్లు రైతుబంధు నిధులను విడుదల చేసిందని,  రైతుబంధు నిధు లు ఈ నెల 29 నుంచే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పారు. బ్యాంకర్లు ఎట్టి పరిస్థి తుల్లోనూ రైతుల ఖాతాల్లో జమ అయిన రైతబంఽ దు నిధులను ఇతర లోన్లు లేదా బదలాయించడం, జమ చేసుకోవడం వంటివి చేయకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇదివరకే నిర్వ హించిన రాష్ట్ర, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం లోను బ్యాంకర్లకు స్పష్టంగా తెలియజేశామని గు ర్తు చేశారు. ముందుగా ఒక ఎకరం ఉన్న రైతుల కు నిధుల జమచేయడం ప్రారంభమైందని, తర్వా త 2, ఆ తర్వాత 3 ఎకరాలు ఈ విధంగా విడతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమవు తాయని తెలిపారు. ఒమైక్రాన్‌ కేసుల నేపథ్యం దృష్ట్యా బ్యాంకుల వద్ద పూర్తి కరోనా నిబంధనలు పాటించేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌కు ఎల్‌డీఎం నాగరాజు, ఆయా బ్యాంకుల నియత్రణ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారిణి సుచరిత, తదితరులు పాల్గొన్నారు.


కేర్‌ ఇండియా సేవలు మరువలేనివి : కలెక్టర్‌


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 30 : కొవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కేర్‌ ఇండియా సంస్థ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. ఇందుకు గాను ఆయన కేర్‌ ఇండియా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేర్‌ ఇండియా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ సంవత్సరం మే నుంచి ప్రత్యేకించి కొవిడ్‌ విభాగంలో పేషెం ట్‌ కేర్‌, ఫిజియో థెరపీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌, వంటివెన్నో రకాల సేవలు అంద జేయడంలో గణనీయమైన పాత్ర పోషించిదని గుర్తు చేశారు. ఆస్పత్రిలో సంస్థ సేవలు ఈ నెలాఖరుతో ముగియనున్న సందర్భంగా గురువారం ఆసుపత్రి వర్గాలు, కేర్‌ ఇండియా ప్రతినిధులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేర్‌ ఇండియా సేవలు ఇంకా జిల్లాకు అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేకించి కేర్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు 20 శాతం నిధులు ఇచ్చేందుకు సుము ఖంగా ఉన్నామని తెలిపారు. కేర్‌ ఇండియా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన భవాని శంకర్‌, సునీల్‌లు మాట్లాడుతూ ఇక మీదట కూడా జిల్లా యంత్రాంగం కోరిక మేరకు సేవలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, డాక్టర్‌ రాంకిషన్‌, తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2021-12-31T06:04:41+05:30 IST