బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-08T05:03:57+05:30 IST

దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు
వనపర్తిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 7: దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వరస్వామి దేవస్థానం, గణపతి ఆలయం, వాసవీ కర్యకాపరమేశ్వరి ఆలయం, అయ్యప్ప దేవాల యంలోని సరస్వతీ మాత సన్నిధిలో దుర్గామాత వి గ్రహాలను ప్రతిష్టించారు. న్యూటౌన్‌ కాలనీ పార్కు లో కాలనీ వాసులు దుర్గాదేవి విగ్రహ్నాన ప్రతిష్ఠించి పూజలు చేశారు. మొదటిరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలతో పాటు బాలాత్రిపుర సుందరి హోమం, గాయత్రి దేవి హోమాన్ని నిర్వహించారు. న్యూటౌన్‌ కాలనీలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, ఉత్సవాల నిర్వాహకులు రామన్‌గౌడు, ఆంజనేయులు, సాయి బాబా, నారాయణరెడ్డి, రఘు, సుదర్శన్‌శెట్టి, కళావ తి, వెంకటేశ్వర్లు, సుదర్శన్‌ గౌడు, సత్యనారాయణ, అ నిల్‌, పుష్పలత, శారద, విజయలక్ష్మి, చంద్రకళ, వరల క్ష్మి, శ్రీదేవి, లక్ష్మికళ, జయమ్మ పాల్గొన్నారు.

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ : దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కేతేపల్లి కన్యకాపరమేశ్వరీ ఆలయం లో బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇ చ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి మధన్‌మోహ న్‌ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం నిర్వ హించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయ కులు వీరన్నశెట్టి, రాంబాబుశెట్టి, శ్రీనివాసులు, ప్రణీ త్‌, ప్రశాంత్‌, వెంకటేష్‌, శ్రీనివాసులు ఉన్నారు.

కొత్తకోటలో.. 

కొత్తకోట : దేవీ శరన్నవరాత్రులను పురస్కరించు కొని మండలంలోని ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శంకర భవాని ఆలయంలో అంబా భవానిమాత లలితాదేవిగా, కన్య కా పరమేశ్వరి ఆలయంలోని వాసవీ మాతగా, భక్త మార్కండేయ ఆలయంలోని పార్వతీదేవి బాలాత్రిపు ర సుందరి దేవిగా, కానాయపల్లి గ్రామ శివారులోని కోటిలింగేశ్వరస్వామి ఆలయంలోని జ్ఞానాభింకాదేవి బాలత్రిపురసుందరి దేవిగా దర్శనం ఇచ్చారు. కొత్త కోట పాత కాలేజీ, పాత పట్టణంతో పాటు కనిమెట్ట, పామాపురం గ్రామాల్లో  దేవి విగ్రహాలను ప్రతిష్ఠిం చి పూజలు నిర్వహించారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు : శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం  బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.  వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు పూజలందు కుంటున్నారు.

అమరచింతలో.. 

అమరచింత : అమరచింత మునిసిపాలిటీలోని శ్రీ కృష్ణనగర్‌లోని కాళికాదేవి ఆలయంలో  గురువారం ఆలయ కమిటీ నిర్వాహకులు కాళికాదేవిని బాలా త్రిపుర సుందరిదేవిగా అలంకరించి పూజలు చేశారు.  మహంకాళ వీధిలో  చౌడేశ్వరి ఆలయంలో దేవికి ప్ర త్యేక పూజలు చేశారు. అలాగే పట్టణంలోని  విఘ్నే శ్వర్‌నగర్‌లో, సామజగన్‌ వాడలో అమ్మవారిని   స్వర్ణకవచ దుర్గాదేవిగా అలంకరించారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ నిర్వాహకులు కొట్టం నాగేశ్వర్‌ రెడ్డి, తాటికొండ రమేష్‌, మహంకాల ఎల్లప్ప, తిరు మల ప్రకాష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట :  మండల కేంద్రంతో పాటు మండ లంలోని వివిధ గ్రామాల్లో దేవిశరన్నవరాత్రి ఉత్సవా లు వైభవంగా జరుగుతున్నాయి. గోపాల్‌పేట, శివాల యంలో గురువారం మహేశ్వరస్వామి, గిరిజాశంకర స్వామి పూజారుల ఆధ్వర్యంలో మొదటి రోజు పూజ లు ఘనంగా జరిగాయి. అమ్మవారిని శైలపుత్రిక గా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు దంపతులు హోమం జరిపించారు. ఏదుల గ్రామంలోని ఎర్రగట్టు వీరాంజనేయ స్వామి ఆలయ మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాత బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చింది. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగమణి, నరేష్‌చారి, సుమలత, దేవాలయ కమిటీ సభ్యులు కృపాకర్‌రెడ్డి, రాజు, బాలు, హుసేన్‌, ఆంజ నేయులు, వెంకటయ్య, ఈశ్వర్‌ ఉన్నారు.
Updated Date - 2021-10-08T05:03:57+05:30 IST