టీడీపీ నాయకుడికి బక్కని పరామర్శ
ABN , First Publish Date - 2021-08-21T04:52:27+05:30 IST
టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పరామర్శించారు.
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 20 : టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పరామర్శించారు. స్థానిక హన్మాన్‌పురలోని చంద్రశేఖర్‌రెడ్డి స్వగృహానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్‌రెడ్డిని ఓదార్చారు. కుటుంబానికి సానుభూతి తెల్పుతూ కుటుంబంపై భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు మాలాద్రిరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, కుమార్‌గౌడ్, భాస్కర్ నాయక్, మురళి పాల్గొన్నారు.