బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్‌ఆర్‌

ABN , First Publish Date - 2021-09-03T04:49:35+05:30 IST

డా.వై.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్‌ఆర్‌
పేటలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

నారాయణపేట, సెప్టెంబరు 2 : డా.వై.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంత రం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో రేవంత్‌ సైన్యం జిల్లా అధ్యక్షుడు యూసూఫ్‌, సీతారాం, అనిల్‌; నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ని గంగాధర్‌ ఆధ్వర్యంలో మక్తల్‌లో ఆ యన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నరేందర్‌, మల్లేష్‌, మోహన్‌, నాగరాజ్‌రెడ్డి, ఎల్లప్ప, వెంకటేష్‌, హన్మప్ప, మారుతి, శివన్నగౌడ్‌, సద్దాం, చంద్రకాంత్‌, నందు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T04:49:35+05:30 IST