హైదరాబాద్‌ వెళ్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-02-02T03:19:36+05:30 IST

హైదరాబాద్‌లోని సీఆర్‌డీ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వెళ్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను సోమవారం పేట పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ వెళ్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల అరెస్టు

నారాయణపేట రూరల్‌, ఫిబ్రవరి1: హైదరాబాద్‌లోని సీఆర్‌డీ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వెళ్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను సోమవారం పేట పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కోటకొండ, పేరపళ్ల, లింగంపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్లు డి.కృష్ణయ్య, శివకుమార్‌, నారాయణలు ఉన్నారు. వీరి అరెస్టును సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జేవీరావులు ఖండించారు. అనంతరం వారిని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను అరెస్టు చేయడంపై సీఐటీయూ ఆధ్వర్యంలో పేట అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, కాశప్ప, ఎ.నరసింహ, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హన్మంతు, ప్రజానాట్యమండలి నాయకులు బాలప్ప, జి.లక్ష్మయ్య, దస్తప్ప, తిమ్మన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T03:19:36+05:30 IST