దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-10-15T04:51:24+05:30 IST

జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద దసరా పర్వదిన ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు.

దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి
విద్యుత్‌ వెలుగుల్లో నాగర్‌కర్నూల్‌లోని ట్యాంక్‌బండ్‌

- మినీ ట్యాంక్‌బండ్‌ విద్యుద్దీపాలతో అలంకరణ

- సాయంత్రం శమీ వృక్షానికి పూజలు చేయనున్న ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి


నాగర్‌కర్నూల్‌ టౌన్‌/క్రైం, అక్టోబరు 14: జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద దసరా పర్వదిన ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌ను ఆధునీకరించడంతో పాటు శుభ్రం చేసి విద్యుద్దీపాలతో సుందరం గా అలంకరించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వీధిలైట్లు, మొక్కలపై విద్యుద్దీపాలతో అ లంకరించి రంగులు వెలుగులతో సందర్శకులను ఆకుట్టుకునేలా సుందరీకరించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన మినీ ట్యాంక్‌బండ్‌పై శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అ నంతరం ట్యాంక్‌బండ్‌ సాంస్కృతిక వేదిక వద్ద నిర్వహించనున్న దసరా సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. దసరా వేడుకలు తిలకించేందుకు వచ్చే  పట్టణ ప్రజల సంద ర్శనకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మునిసిపల్‌ అధికారులు తగిన ఏర్పాట్లను చేసి ఉంచారు. 

ట్యాంక్‌బండ్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌ పరిధిలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ గాంధీనాయక్‌ తెలిపారు. మినీ ట్యాంక్‌బండ్‌పై దసరా ఉత్సవాల సందర్శనకు వచ్చే ప్రజలు తమ వాహనాలను ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణంలో పార్కింగ్‌ చేయాలని సూచించారు. అలాగే ఎండబెట్లకు రాకపోకలు కొనసాగించే వాహనాలు మంతటి చౌరస్తా మీదుగా లేదా ఉయ్యాలవాడ మీదుగా వెళ్లాలని ఆదేశిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.   

Updated Date - 2021-10-15T04:51:24+05:30 IST