చదువుల తల్లి శిరీషకు సెల్‌ఫోన్
ABN , First Publish Date - 2021-02-02T04:03:24+05:30 IST
గత నెల 9న ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో ‘చదవుకు లాక్‌డౌన్’ శీర్షికన సెల్ ఫోన్లు, టీవీలు లేకపోవ డం వల్ల ఆన్‌లైన్ క్లాసు లకు విద్యార్థులు దూర మవుతున్న పరిస్థితిపై క థనం ప్రచురితమైంది.

- ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా అందుకున్న విద్యార్థిని
గద్వాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : గత నెల 9న ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో ‘చదవుకు లాక్‌డౌన్’ శీర్షికన సెల్ ఫోన్లు, టీవీలు లేకపోవ డం వల్ల ఆన్‌లైన్ క్లాసు లకు విద్యార్థులు దూర మవుతున్న పరిస్థితిపై క థనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించి న హైదరాబాద్‌లోని ఫి ల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో పని చేసే చిరుద్యోగి దయ్యాల శ్రీనివాస్ తన పిల్లల కోసం దాచుకున్న మొత్తంతో ఇద్దరు విద్యార్థినులకు సెల్‌ఫోన్లు కొనిచ్చారు. అందులో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన శిరీష కూడా ఉన్నారు. పదో తరగతిలో 9.7 మార్కుల సాధించిన ఈమెకు ఇంటర్ చదవడానికి అర్థిక స్ధోమత లేకపోవడం, ఇంట్లో టీవీ, సెల్ ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులను వినడానికి వీలుగా శ్రీ నివాస్ ఫోన్‌ను కొని ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ మే రకు ఆంధ్రజ్యోతి గద్వాల స్టాఫర్ బొజ్జ రాజశేఖర్ సెల్‌ఫోన్‌ను సోమవారం శిరీషకు అందించారు. శిరీష మామయ్య వెంకటేశ్వర్లు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతికి, సె ల్‌ఫోన్ అందించిన దయ్యాల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.