దుకాణాల కేటాయింపు ఎప్పుడో..?
ABN , First Publish Date - 2021-03-22T04:26:36+05:30 IST
‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన షెడ్లు ని ర్మాణం పూర్తి అయి మూడు నెలలు గడ చినా ఇ ప్పటికి తమకు దుకాణాలు కేటాయించడం లేదని చిరువ్యాపారులు నిరాశకు గురవుతున్నారు.

- రోడ్లపైన వ్యాపారాలు
- స్తంభిస్తున్న ట్రాఫిక్
- మాట పడాల్సి వస్తోందని ఆవేదన
- త్వరగా అప్పగించాలని
వీధి వ్యాపారుల వేడుకోలు
గద్వాల టౌన్, మార్చి 21: ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన షెడ్లు ని ర్మాణం పూర్తి అయి మూడు నెలలు గడ చినా ఇ ప్పటికి తమకు దుకాణాలు కేటాయించడం లేదని చిరువ్యాపారులు నిరాశకు గురవుతున్నారు. పట్టణం లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకుని రూ.9.50 లక్షలతో 25 షెడ్లను నిర్మించా రు. అయితే ఇప్పటికే ఆ స్థలంలో వ్యాపారాలు నిర్వ హించుకునే వారు రోడ్లపైనే కార్యకలాపాలు కొన సాగించాల్సి రావడంతో ఇబ్బందులకు గుర వుతున్నామని వాపోతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని పోలీసులతో మాట పడాల్సి వస్తోం దని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సాధ్య మైనంత త్వరగా త మకు షాపులు కేటాయిస్తే వ్యా పారాలు సాఫీగా నిర్వహించు కునే వీలు కలుగుతుందని కోరు తున్నారు. అయితే సంబంధిత లబ్ధి దారుల ఎంపిక కోసం మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. వ్యా పారుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎంపికకు అవ రోధంగా మారింది. దీనికి తోడు కొంతమంది వ్యాపా రాలు చేయకున్న పేర్లు అందజేశారని, మరికొందరు ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లను ఇచ్చారని కమిటీ ముందుకు అభ్యంతరాలు వచ్చాయి. దాంతో లబ్ధిదారుల ఎంపికను వాయిదా వేశారు. మరికొంత స్థలం కూడా అందుబాటులో ఉన్నందున అదనంగా రూ. 5లక్షలతో మరో 10 షెడ్లు నిర్మించేందుకు చైర్మన్ బి.ఎస్. కేశవ్ చేసిన ప్రతిపాదనను గత నెలలో సమావేశమైన కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదిం చింది. వాటి నిర్మాణం ముగిసిన వెంటనే వ్యాపా రులకు అప్పగించాలని మునిసిపల్ పాలకుల అభి ప్రాయంగా ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే షాపులను అప్పగిస్తాం
రోడ్లపై వ్యాపారాలు నిర్వహించు కునే వారికి ఇబ్బందులు తలెత్తకుండా సాధ్య మైనన్ని ఎక్కువ షాపులు నిర్మించాలన్నదే మా ఉద్దేశం. ప్రస్తుతం నిర్మించిన వాటితో పాటు పట్టణంలో అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి మరికొన్ని షాపులను కూడా నిర్మిం చాలని ప్రా థమికంగా నిర్ణ యించాం. ట్రాఫిక్‌కు అంతరాయం లేని స్థలా లను గుర్తించి మరికొన్ని షాపులు నిర్మిస్తాం. నిర్మాణం పూర్తి అయిన వాటికి త్వరలోనే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికజేసి అందజేస్తాం.
- బీఎస్ కేశవ్, మునిసిపల్ చైర్మన్, గద్వాల