అన్ని వాహనాలు మల్దకల్‌ వైపే

ABN , First Publish Date - 2021-12-20T04:46:52+05:30 IST

మల్దకల్‌ మండల కేం ద్రంలో ఆదివారం రాత్రి జరిగిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అన్ని వాహనాలు మల్దకల్‌ వైపే
ప్రైవేట్‌ వాహనాలపై తరలివస్తున్న ప్రజలు

 - వేంకటేశ్వర స్వామి రథోత్సవానికి తరలివచ్చిన భక్తజనం

-  కిక్కిరిసిన రహదారులు

మల్దకల్‌, డిసెంబరు 19: మల్దకల్‌ మండల కేం ద్రంలో ఆదివారం రాత్రి జరిగిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే మల్దకల్‌ మండలం వైపు వాహనాల రాక మొదలైం ది. మధ్యాహ్నం మేరకు అయిజ గద్వాల రహదారిలోపాటు రాయచూరు, కర్నూలు వైపు నుంచే గాక వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వాహనాలలో భక్తులు రథోత్సవాన్ని తిలకించడానికి తరలివచ్చారు. మల్దకల్‌ చుట్టు పక్క పరిసరాలన్నీ భక్తుల విడిదితో నిండిపోయాయి. ఆలస్యంగా మల్దకల్‌ చేరుకున్న భక్తులకు విడిదికి అనువైన స్థలాలు దొరకక పోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు భక్తులు విడిది చేశారు. స్థానిక పోలీసులు గ్రామం బయటనే ఉండి   వాహనాలు రథోత్సవ ప్రాం గణంలోకి  వెళ్లకుండా కట్టుదిట్టం చేసి ట్రాఫిక్‌ను ని యంత్రించారు. దేవాలయంలో కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండండతో దేవుడి దర్శనానికి గంటల సమయం పట్టింది. రథోత్సవ కార్యక్రమానికి సుమారు లక్షమంది దాకా భక్తులు హాజరుకావచ్చుననే అంచనాతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  భక్తుల సేవలో ఆర్టీసీ

గద్వాల అర్బన్‌ :  జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లోని స్వయంభూ  లక్ష్మీవెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. భక్తుల అవసరాల మేరకు   గద్వాల, అయిజ, అలంపూరు చౌరస్తా, అలంపూరు, ఇతర రాష్ర్టాల నుంచి కర్నూలు, రాయచూరు తదితర ప్రాంతాల నుంచి దాదాపు 30అదనపు బస్సులను ఈ నెల 18నుంచి 21వరకు నడుతున్నారు. గద్వాల పాత బస్టాండ్‌ తాత్కాలిక బస్‌షెల్టర్‌ను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు గా బస్సులను ఏర్పాటు చేశారు.  

Updated Date - 2021-12-20T04:46:52+05:30 IST