కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : డీఈవో

ABN , First Publish Date - 2021-02-02T02:33:33+05:30 IST

పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రతీ బడిలోనూ కొవిడ్‌-19 నిబంధనలు తప్పక పాటించాలని డీఈవో సుశీందర్‌రావు అన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి  : డీఈవో
కొత్తకోటలో విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో సుశీందర్‌రావు

కొత్తకోట, ఫిబ్రవరి 1: పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రతీ బడిలోనూ కొవిడ్‌-19 నిబంధనలు తప్పక పాటించాలని డీఈవో సుశీందర్‌రావు అన్నారు. కొత్తకోట మండలంలోని 12 హైస్కూల్స్‌ సోమవారం తెరుచుకున్నాయి. పట్టణంలోని బాలికల పాఠశాలను  ఆయన పరిశీలించారు. బడికి వచ్చిన విద్యార్థులకు టెంపరేచర్‌ మిషన్‌తో పరీక్షించి నిబంధనల ప్రకారంగా బెంచీకి  ఒక్కరు, ఇద్దరు చొప్పున కూర్చోబెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.

60మంది విద్యార్థులు హాజరు

 గోపాల్‌పేట/ పెద్దమందడి/ వీపనగండ్ల: గోపాల్‌పేటలోని జడ్పీ ఉన్నత పా ఠశాలలో సోమవారం 9, 10వ తరగతులకు చెందిన 60మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతీ విద్యార్థికి మాస్క్‌లు పెట్టి శానిటైజ్‌ చేసి ఉపాధ్యాయులు తర గతి గదుల్లోకి పంపించారు.  పెద్దమందడి మండలంలోని అన్ని పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులు సుమారు 1000 మంది దాకా ఉండగా మొదటి రోజు 268 మంది మాత్రమే స్కూల్‌కు వచ్చారని  ఎంఈవో జయశంకర్‌ తెలిపారు.

బెంచీకి ఇద్దరు చొప్పున విద్యార్థులు 

అమరచింత:  పట్టణంలోని బాలికల పాఠశాలను విలేకర్ల బృందం పరిశీలించగా ఆ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు 46మందికి గానూ 30 మంది హాజరై ఒకే గదిలో బెంచీకి ఇద్దరు చొప్పున కూర్చున్నారు.  మండలం లోని నాగల్‌కడుమూర్‌, మస్తీపూర్‌, ఈర్లదిన్నెలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఆయా ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ 

పాన్‌గల్‌: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అం దిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌, హెచ్‌ఎం మద్దిలేటి, ఎంపీటీసీలు హైమావతి, భాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుబ్బయ్యయాదవ్‌, దశరథం నాయుడు ఉన్నారు.

Updated Date - 2021-02-02T02:33:33+05:30 IST