పార్టీకి పూర్వవైభవం తేవాలి
ABN , First Publish Date - 2021-02-06T04:34:35+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడి లాగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు.
- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్
ఉండవల్లి, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడి లాగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని దుంపల రామకృష్ణారెడ్డి నివాసంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గజేందర్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి పునరుత్తేజం తెచ్చేందుకు అన్ని విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండలంలో పార్టీకి మంచి క్యాడర్ ఉందని, ఇందుకు సర్పంచు, ఎంపీటీసీ, పీఏసీఎస్ ఎన్నికలే నిదర్శనమన్నారు.