కలగా.. కల్లాలు..

ABN , First Publish Date - 2021-02-06T04:56:55+05:30 IST

రైతులు పండించిన పంటను ఆరబెట్టుకో వడంతో పాటు నూర్పిడిలు చేసేందుకు పొలాల మధ్య ప్రయోజనకరంగా ఉండేందుకు కల్లాలు దోహదపడుతాయి.

కలగా.. కల్లాలు..
పూసల్‌పాడ్‌లో పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిచందన (ఫైల్‌)

 నారాయణపేట జిల్లాలో నత్తనడకను తలపిస్తున్న పనులు


నారాయణపేట, ఫిబ్రవరి 5 : రైతులు పండించిన పంటను ఆరబెట్టుకో వడంతో పాటు నూర్పిడిలు చేసేందుకు పొలాల మధ్య ప్రయోజనకరంగా ఉండేందుకు కల్లాలు దోహదపడుతాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గ్రా మీణ ప్రాంతాల్లో కల్లాల నిర్మాణాలకు నడుం బిగించింది. మహాత్మా గాం ధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నారాయణపేట జిల్లా లోని 11 మండలాల్లో 2,428 మంది రైతులకు కల్లాల నిర్మాణానికి అనుమ తులు లభించాయి. కానీ, రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వీటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 


జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 కల్లాల నిర్మాణాలు పూర్తి కాగా, ఇంకా 682 నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మండలాల వారీగా అత్యధి కంగా మద్దూర్‌లో 598 మంది రైతులకు కల్లాల నిర్మాణానికి అనుమతు లు లభించగా, ఎనిమిది పనులు పూర్తి కాగా 142 పనులు కొనసాగుతు న్నాయి. అత్యల్పంగా కృష్ణాలో 42 మంది రైతులకు గాను రెండు పనులు పూర్తి కాగా, 40 పనులు కొనసాగుతున్నాయి.


మాగనూర్‌లో 152 మంది రైతులకు గాను 92 పనులు కొనసాగుతుండగా, రెండు పనులు పూ ర్తయ్యాయి. మక్తల్‌లో 148 మంది రైతులకు గాను 88 పనులు ప్రారంభం కాగా, ఆరు పనులు పూర్తయ్యాయి. కోస్గిలో 304 మంది రైతులకు గాను 72 కల్లాల పనులు ప్రారంభం కాగా, ఆరు పనులు పూర్తయ్యాయి. ధన్వాడలో 329 మంది రైతులకు గాను 64 పనులు ప్రారంభం కాగా, నా లుగు పనులు పూర్తయ్యాయి.


నారాయణపేటలో 266 మంది రైతులకు గాను 54 పనులు కొన సాగుతుండగా, నాలుగు పనులు పూర్తయ్యాయి. నర్వలో 86 మంది రైతులకు గాను 40 పనులు కొనసాగుతుండగా, రెండు పనులు పూర్తయ్యాయి. దామరగిద్దలో 289 మంది రైతులకు గాను 30 ప నులు కొనసాగుతుండగా, పది పనులు పూర్తయ్యాయి. ఊట్కూర్‌లో 115 మంది రైతులకు గాను 26 పనులు కొనసాగుతుండగా, నాలుగు పనులు పూర్తయ్యాయి.


మరికల్‌లో 101 మంది రైతులకు 21 పనులు కొనసాగు తుండగా, 20 పనులు పూర్తయ్యాయి. కాగా, కల్లాల నిర్మాణం, వాటి ఆవ శ్యకత గురించి జిల్లా వ్యవసాయాధికారి జాన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో అవ గాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-02-06T04:56:55+05:30 IST