ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-27T03:48:52+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే అనుచరులు భయ భ్రాంతులకు గురిచేసి తప్పుడు అగ్రిమెంటుతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని దళితులకు అన్యాయం చేశారని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బోనాసి రాంచందర్‌ ఆరోపించారు.

ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులు

- బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బోనాసి రాంచందర్‌

- బైండ్ల వాయిద్యాలతో కలెక్టరేట్‌ ముందు బాధితుల నిరసన

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: స్థానిక ఎమ్మెల్యే అనుచరులు భయ భ్రాంతులకు గురిచేసి తప్పుడు అగ్రిమెంటుతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని దళితులకు అన్యాయం చేశారని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బోనాసి రాంచందర్‌ ఆరోపించారు. శుక్రవారం సీపీఎం, బీఎస్పీ, బీఎంపీ, కేవీపీఎస్‌ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బాధిత దళితుడు బైని కాశన్న కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌ ముందు ధర్నా ని ర్వహించారు. బైండ్ల వాయిద్యాలతో పాటలు పాడుతూ నిరసన తెలిపి అనంత రం కలెక్టరేట్‌ పరిపాలనా విభాగంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా బోనాసి రాంచందర్‌ మాట్లాడుతూ 1954లో ప్రభుత్వం బైని కాశన్నకు 5 ఎకరాల 22గుంటల భూమిని ఇచ్చిందని, అప్పటి నుంచి అతని వారసులు దానిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. అమాయకులను చూసుకుని అధికారుల ను తప్పుదోవ పట్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఎమ్మెల్యే అనుచరులపై చ ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్‌.శ్రీనివాస్‌, బీఎంపీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గడ్డం విజయ్‌, అంబేడ్కర్‌ జాతర కమిటీ జిల్లా నాయకులు భానుప్రకాష్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకుడు కాశన్న, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య, మైనార్టీ నాయకుడు నిజాం, బాధిత రైతులు ఆంజనేయులు, నాగన్న, దశరథం, శివ, దుర్గమ్మ, అలివేల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T03:48:52+05:30 IST