అకౌంట్ లాక్
ABN , First Publish Date - 2021-05-21T05:16:26+05:30 IST
ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ఖాతాల్లో లావాదేవీలు నిలిచిపోతున్నాయి.

- జన్-ధన్ యోజన ఖాతాదారులకు కష్టాలు
- మూడు నెలలుగా జమ కాని పింఛన్లు
గద్వాల, మే 20 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ఖాతాల్లో లావాదేవీలు నిలిచిపోతున్నాయి. కొందరు ఖాతాదారులకు మూడు నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. ఈ విషయంపై లబ్ధిదారు లు బ్యాంకర్లను ఆశ్రయించగా, మీ ఎకౌంట్ లిమిటెడ్ ఎక్సీడ్ (రూ.లక్ష లావాదేవీలు దాటిన ఖాతాలు) అయ్యాయని సమాధానం ఇస్తుండ టంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 84,596 జన్-ధన్ యోజన ఖాతాదారు లు ఉన్నారు. నిబంధన ప్రకారం ఈ ఖాతాల్లో ఒక సారి రూ.50 డిపా జిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఖాతా లాక్ అవుతుంది. అలాగే ఏడాదికి రూ.లక్ష లావాదేవీలు జరిపినా ఖాతా లాక్ అవుతుంది. ఈ విషయం తె లియని చాలా మంది మహిళలు ఉపాధి హామీ డబ్బులు, నెలనెలా వ చ్చే పింఛన్ డబ్బులను ఈ ఖాతా ద్వారా లావాదేవీలు జరిపారు. దీంతో వారి ఖాతాలు ఎక్సీడ్‌తో ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ ఖాతాలు ఉన్న రాజోలి మండలంలోని 30 మంది మహిళలకు మూడు నెలలుగా పింఛ న్‌లు జమ కావడం లేదు. గద్వాల మునిసిపాలిటీని జిమ్మచేడులో మరో 20 మంది లబ్ధిదారుల ఖాతాలో కూడా పింఛన్ జమ కాలేదు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కూడా ఇదే పరిప్థితి ఉంది. కాగా, ఈ ఖాతాలను సేవింగ్ అకౌంట్లుగా మార్చడానికి, కొత్త అకౌంట్లు తీసి పిం ఛన్ మంజూరు చేయించడంలో ఎంపీడీవోలు, బ్యాంకర్లు సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని డీఆర్‌డీవో ఉమా దేవి దృష్టికి తీసుకెళ్లగా ఖాతాలు లాక్ అయిన మాట వాస్తవమేనని చె ప్పారు. అయితే, లబ్ధిదారులకు రావాల్సిన పింఛన్‌ను మంజూరు చేయిం చడానికి ఎంపీడీవోలు బ్యాంకర్లతో మాట్లాడుతున్నారని ఆమె వివరిం చారు. కాగా, జన్-ధన్ ఖాతాల్లో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని లీడ్ బ్యాంకు అధికారి రవీంద్ర కుమార్ ఆంధ్రజ్యోతికి అన్నారు.