తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-12-16T05:15:16+05:30 IST
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గ్రామస్థులు ఇబ్బందులు పడకుండా వెంటనే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- కూలిన బ్రిడ్జి పరిశీలన
ధరూరు, డిసెంబరు 15 : వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గ్రామస్థులు ఇబ్బందులు పడకుండా వెంటనే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ధరూరు మండల పరిధిలోని భీంపురం సమీపంలో కుప్పకూలిన జూరాల కుడి కాల్వ బ్రిడ్జిని బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన నిర్మాణానికి సంబంధించిన అంచనాలను వెంటనే తయారు చేయాలని, ఈఎంసీ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. భీంపురం బ్రిడ్జీతో పాటు గద్వాల పట్టణం నుంచి నదీ అగ్రహారం వెళ్లే బ్రిడ్జీ నిర్మాణం కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సభ్యురాలు పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కేటీఆర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌రెడ్డి, జాకీర్ తదితరులు ఉన్నారు.