వివేకానందుడికి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-01-13T04:07:33+05:30 IST
స్వామి వివేకా నంద జయంతిని మంగళవారం జిల్లా నిర్వహించారు.వివేకానంద విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాలి అర్పించారు.

నారాయణపేట/నారాయణపేట టౌన్/ నారాయణపేట రూరల్/ ధన్వాడ/ మరికల్/ మక్తల్/ నర్వ/ కోస్గి, జనవరి 12 : స్వామి వివేకా నంద జయంతిని మంగళవారం జిల్లా నిర్వహించారు.వివేకానంద విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాలి అర్పించారు. పేట లో యువజన, క్రీడలు, విద్యాశాఖ సంయుక్తంగా చేపట్టిన 2కేరన్ కార్యక్ర మాన్ని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు, యువకులు క్రీడాకారులతో కలిసి ఎస్పీ కార్యాల యం, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు 2కే రన్‌లో పాల్గొన్నారు. పేట జిల్లా ఆసుపత్రిలో మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ వనజ, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ, ఏబీవీపీ, యువకులతోపాటు, పీఆర్టీయూ ఆధ్వ ర్యంలో నివాళి అర్పించారు. పేట మండలం బొమ్మన్ పాడులో వివే కానంద విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. మరి కల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నర్వలో భజరంగ్‌దళ్, కోస్గి మండలం హన్మాన్‌పల్లిలో, మక్తల్ మండలం మాద్వార్, కర్ని, జక్లేర్, మండలంలోని దామరగిద్ద, మద్దెల్‌బీడ్ తదితర గ్రామాల్లో వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు.

