బిపిన్‌ రావత్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-10T05:04:06+05:30 IST

త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలిక్యాప్టర్‌ దుర్ఘటనలో అసువులు బాయడం దేశానికి తీరని లోటని కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్‌ నరేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

బిపిన్‌ రావత్‌కు ఘన నివాళి
పేటలోని కృష్ణవేణి పాఠశాలలో నివాళి అర్పిస్తున్న విద్యార్థులు

నారాయణపేట, డిసెంబరు 9: త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలిక్యాప్టర్‌ దుర్ఘటనలో అసువులు బాయడం దేశానికి తీరని లోటని కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్‌ నరేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం పాఠశాల విద్యార్థులు బిపిన్‌ రావత్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి వీర జవాన్లకు నివాళి అర్పించారు. తీవ్ర గాయాలతో బయట పడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్‌, తిక్కయ్య, ఉజ్వల, నర్మద, రాజశేఖర్‌, ఆనంద్‌, అశ్విని, శ్రావణి, రేఖబాయి, మల్లీశ్వరి, కల్పన పాల్గొన్నారు. త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, నందు నామాజీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రావత్‌ అసమాన సైనికుడని, అసలైన దేశ భక్తుడని కొనియాడారు.

ధన్వాడ : హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు హిందువాహిని, బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధన్వాడలో నివాళి ఆర్పించారు. త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ చిత్ర పటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ రాంచంద్రయ్య, జుట్ల సుదర్శన్‌గౌడ్‌, బాలరాజు, సిరిగిరి నాగరాజు, రవి పాల్గొన్నారు.

మరికల్‌ : మండలంలోని ప్రతిభ పాఠశాల విద్యార్థులు గురువారం త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, కరస్పాండెంట్‌ హన్మంతురెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మక్తల్‌ : పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తన స్వగృహంలో రావత్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు శ్రీహరి త్రివిధ దళాధిపతి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ చిత్రపటానికి వేర్వేరుగా పూలమాల వేసి నివాళి అర్పించారు.పలువురు వక్తలు మాట్లాడుతూ రావత్‌ కుటుంబం దేశానికి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు కర్ని స్వామి, దేవరింటి నర్సింహారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాల్చెడ్‌ మల్లికార్జున్‌, చంద్రశేఖర్‌, మంజునాథ్‌, మహేష్‌సాగర్‌, సూర్య అంజనేయులు, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నర్సిములు, ఆనంద్‌గౌడ్‌, గోలపల్లి నారాయణ, మల్లేష్‌,  సురేష్‌కు మార్‌ గుప్తా, రవికుమార్‌, గోవర్దన్‌ పాల్గొన్నారు. Updated Date - 2021-12-10T05:04:06+05:30 IST