బండ్ల వెంకట్రామిరెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-11-24T04:40:42+05:30 IST

గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైకుంఠ సమారాధన నిర్వహించారు.

బండ్ల వెంకట్రామిరెడ్డికి ఘన నివాళి
బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

    గద్వాల క్రైం, నవంబరు 23 : గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైకుంఠ సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి సతీమణి రేవతమ్మ, కుమారులు బండ్ల శివప్రసాద్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోడళ్లు ఉషారాణి, జ్యోతి, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామి రెడ్డికి మంత్రి శ్రీనివాస్‌గౌడు, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి ఆల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు అబ్రహం,  అంజయ్య యాదవ్‌, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయితీ రాజ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ నివాళి అర్పించారు. కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, ఆర్డీవో రాములు, డీఎస్పీ రంగస్వామి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌, డీఎం హెచ్‌వో చందూనాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి,  మునిసిపల్‌ చైర్మన్లు బీఎస్‌ కేశవ్‌, కరుణ, మనోరమ, దేవన్న తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. Updated Date - 2021-11-24T04:40:42+05:30 IST