ఘనంగా పాగుంట వెంకన్న రథోత్సవం

ABN , First Publish Date - 2021-11-06T04:55:27+05:30 IST

పాగుంట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో గద్వాల నియోజక వర్గంలోని రైతులు, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఘనంగా పాగుంట వెంకన్న రథోత్సవం
రథానికి హారతి ఇస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

- ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 

కేటీదొడ్డి, నవంబరు 5 : పాగుంట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో గద్వాల నియోజక వర్గంలోని రైతులు, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలోని పాగుంట వెంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన రథోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని ప్రజాప్రతినిధులు, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ముందుగా ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించామని, రైతుల సంతోషం కోసం బండలాగుడు పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా గురువారం సీఐ షేక్‌ మహబూబ్‌బాషా, స్థానిక ఎస్‌ఐ కురుమయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, ఈవో పురేంధర్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు, సర్పంచు ఆంజనేయులు, నాయకులు గోపి, ఆలయ కమిటీ సభ్యులు, ట్రైనీ ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 


Updated Date - 2021-11-06T04:55:27+05:30 IST