22న 1104యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌

ABN , First Publish Date - 2021-10-20T04:50:47+05:30 IST

జిల్లా కేంద్రంలోని వైట్‌హౌస్‌హాలులో ఈ నెల 22న తెలంగాణ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ (1104) యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ కౌన్సి ల్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సంఘం నాయకులు జి.స్వామి, పాండు నాయక్‌ తెలిపారు.

22న 1104యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌

- హాజరుకానున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

- ఉమ్మడి జిల్లా సంఘం నాయకుల వెల్లడి

 పాలమూరు, అక్టోబరు 19 :  జిల్లా కేంద్రంలోని వైట్‌హౌస్‌హాలులో  ఈ నెల 22న తెలంగాణ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ (1104) యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ కౌన్సి ల్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సంఘం నాయకులు జి.స్వామి, పాండు నాయక్‌ తెలిపారు. మంగళవారం పట్టణం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొదటిసారి జనరల్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుం డటం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 1104 యూనియన్‌ బలోపేతం అయిందనటానికి ఇదే నిదర్శనమన్నారు. కౌన్సిల్‌కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వి ద్యుత్‌శాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎక్సైజ్‌శా ఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ట్రాన్స్‌కో సీ.ఎం.డి. డి.ప్రభాకర్‌రావు, ఆపరేషన్‌ సీ. ఎం.డి. జి.రఘుమారెడ్డి, గోపాల్‌రావు, జి.సాయిబాబా హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డి.రామచందర్‌ నాయక్‌, ఎ. వెంకటేష్‌, శాలన్న, నిరంజన్‌ యాదవ్‌, వి.బాలప్రతాప్‌, రామకృష్ణ, ఉమ్మడి జిల్లా కోశాధికారి యం.రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:50:47+05:30 IST